ETV Bharat / sitara

మణి బాణీ కడితే.. సంగీతమే హొయలుపోతుంది - మణి శర్మ సంగీతం

యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ.. తెలుగు, తమిళ, హిందీ భాషా చిత్రాలు ఆయన సంగీతంతో మునిగి తేలాయి. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు. ఇంతకీ...ఇన్ని సూపర్‌ హిట్‌ సినిమాలకు సంగీత దర్శకత్వం చేసిన యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ ఎవరంటారా? మనందరికీ తెలిసిన మణిశర్మ. మణిశర్మ పేరు వినగానే... ఎన్నో పాటలు మనసును రాగరంజితం చేస్తున్నాయి కదూ!. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ స్టోరీ మీకోసం

మణిశర్మ
మణిశర్మ
author img

By

Published : Jul 11, 2020, 1:21 PM IST

సరిగమలతో సహచర్యం... రాగాలతో స్నేహం.. బాణీలతో ముద్దూ, ముచ్చట్లు.. మధుర గీతాలతో మంతనాలు... సందర్భానికవసరంగా కమర్షియల్‌ హొయలు.. దటీజ్‌ మెలోడీ బ్రహ్మ. సంగీతం వింటూ.. సంగీతం తింటూ.. సరసస్వర సుర ఝరీ పానమే ప్రాణంగా, ప్రణవంగా పెరిగారు. సంగీతం మినహా ఆయనకి మిగిలిన ప్రపంచంతో సాన్నిహిత్యం తక్కువ. మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేయడం ఆయన సరదా. ఆ సరదాయే ఇండస్ట్రీలో ఆయనకో ప్రత్యేక స్థానం ఇచ్చి ప్రోత్సహించింది. ఆయనే.. యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ. తెలుగు, తమిళ, హిందీ భాష చిత్రాలు ఆయన సంగీతంతో మునిగి తేలాయి. ఇంతకీ...ఇన్ని సూపర్‌ హిట్‌ సినిమాలకు సంగీత దర్శకత్వం చేసిన యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ ఎవరంటారా? మనందరికీ తెలిసిన మణిశర్మ. మణిశర్మ పేరు వినగానే... ఎన్నో పాటలు మనసును రాగరంజితం చేస్తున్నాయి కదూ!

యమహా నగరి కలకత్తా పురి.. రామ్మా చిలకమ్మా ప్రేమా మొలకమ్మా, ఏ మేరా జహాఁ, అమ్మాయే సన్నగా, నీ నవ్వుల తెల్లదనాన్ని, సాహసం శ్వాసగా, ప్రేమదేశం యువరాణి... ఇలా ఎన్నో పాటలు తేనెల ఊటల్లా మనసుకు తీపిని అద్దుతాయి కదూ! ఔను... మణిశర్మ... సినీతోటలోకి ఆహ్లాదకరంగా విచ్చేసిన సంగీత ఆమని.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సుదీర్ఘ సినీ సంగీత ప్రయాణంలో ఆయన నడిచొచ్చిన దారి నల్లేరు మీద నడక కాదు. ఎన్నో పల్లేర్లు, ముళ్లూ ఉన్నా మొక్కవోని దీక్షతో... తండ్రి సంగీత వారసత్వానికి ఓ అర్థాన్ని, పరమార్థాన్ని తన విజయం ద్వారా అందించిన కళాకారుడు. ఎన్నేళ్లో... ఎంత మంది సంగీత దర్శకుల దగ్గర ఎడతెరపి లేని సంగీత సాధనో...? దాటిన మైలురాళ్లోన్నో? కీ బోర్డు ప్లేయర్‌గా మొదలైన సినీ సంగీత యానంలో చివరాఖరికి సంగీత దర్శకుడిగా ఎదిగి... ఎన్నో విజయవంతమైన చిత్రాలకు మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేసి... ఇప్పుడు ఇండస్ట్రీ దూరం పెట్టినా.. అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తూ స్థిత ప్రజ్ఞత చాటుకుంటున్న ఆత్మాభిమానం, వ్యక్తిత్వం ఉన్న మ్యూజిక్‌ డైరెక్టర్‌ మణిశర్మ.

మణిశర్మ
మణిశర్మ

ఎందరో గురువులు... అందరికీ వందనాలు

అలనాడు సంగీత రసాలూరు సాలూరు రాజేశ్వరరావు నుంచి నిన్నమొన్నటి రాజ్‌ కోటి దాకా శిష్యరికం చేసిన సంగీత ఘనాపాటి మణిశర్మ. కీరవాణి బృందంలో చేరి సుస్వరాల మాధురీ ఝరుల్లో తడిసి ముద్దయి.... లయరాజు ఇళయరాజుని గుండెల్లో నింపుకుని... ఆయనకీ ఏకలవ్య శిష్యుడై... అనంతర కాలంలో తానే సంగీత దర్శకుడిగా మారి సొంత శైలి ఆవిష్కరించిన విద్వత్‌ మణి... మణిశర్మ. అంతమందితో చేసిన శిష్యరికంలో తన ముద్ర వేసుకోవడం నిజంగా కష్టతరమే. ఈ గురువూ ప్రభావం తన సంగీతంపై పడకుండా నవ్యతనందించేలా మణిశర్మ ఎప్పటికప్పుడు చూసుకున్నారు. సంగీత దర్శకుడిగా మరకముందు... కొన్ని రోజుల పాటు ఏ సంగీత దర్శకుడి దగ్గర పనిచేయలేదు. తానేమిటో... తనలోని సంగీత జ్ఞానమెంతో తెలుసుకునేందుకు అంతర్మథనంలో గడిపారు. తనలోకి వెళ్లి... తనతోనే సంభాషించుకుంటూ... తనకు తానే సన్నివేశాలు ఇచ్చుకుంటూ... ఆ సన్నివేశాలకు తగినరీతిలో బాణీలు సమకూర్చుకుంటూ... ఓ యజ్ఞంలా గడిపారు. ఆ తరువాతే...సంగీత దర్శకుడిగా మారారు. యజ్ఞఫలం అందుకున్నారు. ఏ రంగంలోనైనా చిత్తశుద్ధి ఉంటే కార్యసిద్ధి ఉంటుందని స్వీయానుభవంతో చెప్తుంటారు.

అశ్వనీదత్‌ దేవుడు

నిర్మాత అశ్వనీదత్‌ నా పాలిట దేవుడని మణిశర్మ ఏ భేషజాలు లేకుండా బాహాటంగా చెప్తారు. ఎన్నాళ్లిలా ఉండిపోతావ్‌? నువ్వూ మ్యూజిక్‌ డైరెక్టర్‌వి కమ్మంటూ స్ఫూర్తి నింపడమే కాకుండా 'చూడాలని ఉంది' చిత్రంలో అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన ప్రొడ్యూసర్‌ అశ్వనీదత్‌ అంటారు మణిశర్మ. అంతకు ముందు ఆర్జీవీ దగ్గర కూడా 'రాత్రి', 'అంతం' సినిమాలకు తెరవెనుక పనిచేశారు. 'చూడాలని ఉంది'.. సినిమాలో నాయకుడు చిరంజీవి కాగా.. చిన్న తమాషా జరిగింది. మణిశర్మ కట్టిన బాణీలు రెహమాన్‌ పేరుతో చిరంజీవికి వినిపించగానే... బాగున్నాయన్నారు. ఆ తరువాత... ఈ బాణీలు మణిశర్మ కట్టినవంటూ అసలు రహస్యం వెల్లడించారని మణిశర్మ ఇప్పటికీ ఆనాటి సంఘటనను తలచుకుంటారు. 'చూడాలని ఉంది' సినిమాలో అన్ని పాటలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. అశ్వనీదత్‌కి తన చిత్రానికి ఏ తరహా సంగీతం కావాలో అవగాహన మెండుగా ఉందనిచ అందుకే ఆయన సినిమాల్లో పాటలు విజయవంతమవుతాయని మణిశర్మ అభినందిస్తారు. ఆ తరువాత 'బావగారూ బాగున్నారా?' చిత్రానికి కూడా మణిశర్మ సంగీత దర్శకుడు. ఆ వరుసలోనే తెలుగులో ఉన్న అగ్రశ్రేణి నటులందరి చిత్రాలకు మణిశర్మ సంగీతాన్ని అందించారు.

శారీరక భాషను బట్టే సంగీతం

ఒక్కో నాయకుడికి ఒక్కో తరహా శారీరక భాష ఉంటుందంటూ.. అందుకు అనుగుణంగానే బాణీలు సమకూర్చడం తన విజయ రహస్యమని మణిశర్మ చెప్తారు. అగ్రనటులందరితోపాటు అగ్రదర్శకులందరి చిత్రాలకు సంగీతాన్ని మణిశర్మ అందించారు. తాజాగా 'ఇస్మార్ట్‌ శంకర్‌' చిత్రానికి మ్యూజిక్‌ అందించారు. ఈ సినిమాకు దర్శకుడు పూరి జగన్నాథ్. అంతకు ముందు పూరి దర్శకత్వం వహించిన 'టెంపర్‌', 'ఏక్‌ నిరంజన్‌', 'చిరుత', 'పోకిరి' చిత్రాలకు కూడా మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాల్లో పాటలు సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. ఆర్జీవీ, రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, వంశీ, జయంత్‌ సి పరాంజీ, సురేందర్‌ రెడ్డి, ఏ.ఆర్‌.మురుగదాస్, చంద్ర సిద్దార్ధ, లారెన్స్, కె.విజయభాస్కర్, కరుణాకరన్, త్రివిక్రమ్‌ శ్రీనివాస్, బి.గోపాల్, వీరశంకర్, గుణశేఖర్, కృష్ణవంశీ, వి.వి.వినాయక్, కోడి రామకృష్ణ, ఎస్వీ కృష్ణారెడ్డి...ఇలా చాలామంది దర్శకుల చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అనూహ్యంగా కొద్దిపాటి విరామం వచ్చిన తరువాత మళ్లీ 'జెంటిల్‌ మాన్‌’ చిత్రం ద్వారా ట్రాక్‌లోకి వచ్చారు.

అవార్డులు

ఉత్తమ సంగీత దర్శకుడిగా చూడాలని ఉంది సినిమాకు ఫిలిం ఫేర్‌ అవార్డుని మణిశర్మ గెలుచుకున్నారు. అదే సినిమాకు నంది అవార్డు కూడా వచ్చింది. చిరునవ్వుతో సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది విజేతగా నిలిచారు. ఒక్కడు సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది, ఫిలిం ఫేర్‌ పురస్కారాలు లభించాయి. అతడు సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిలిం ఫేర్‌కు నామినేట్‌ అయ్యారు.

సంప్రదాయ కుటుంబ నేపథ్యం

మణిశర్మ.. సినీ సంగీత దర్శకుడిగా వెండితెర పేరు. జన్మనామం యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ. ఆంధ్ర ప్రదేశ్‌ మచిలీపట్టణంలో 1964 జులై 11న పుట్టారు. మణిశర్మ తండ్రి వై. ఎన్‌.శర్మ వేదాలు చదువుకున్న వ్యక్తి. ఆయనకు సంగీతమంటే మక్కువ ఎక్కువ. దాంతో సినీ పరిశ్రమలో సంగీతం ద్వారా ఉపాధి పొందాలని ఓ ఫిడెల్‌ని పట్టుకుని చెన్నయ్‌ వెళ్లారు. ఇప్పట్లోలా కాకుండా ఆడిషన్‌లో విజయం సాధిస్తేనే అవకాశం అందివచ్చేది. రోజుకు పది రూపాయల పారితోషికంతో ఐదుగురు పిల్లలను, కుటుంబాన్ని సాకుతూ ఆయన పడిన కష్టాలు మణిశర్మకి బాగా తెలుసు. ఆ కష్టాల నుంచే మణిశర్మ స్ఫూర్తి పొందారు. అయితే...తండ్రి మాత్రం సినీ ప్రపంచంలోకి రావొద్దంటూ చెప్పేవారు. ఈ కష్టాలు, కడగండ్లు పడలేవని.. ఎంచక్కా నెలకు ఇంతని నికరమైన ఆదాయాన్నిచ్చే ఉపాధి చూసుకోమని హితవు పలికేవారు. అయినా, మణిశర్మ అస్సలు పట్టించుకోలేదు. సంగీతాన్నే నమ్ముకున్నారు. విజయం సాధించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.