బాలీవుడ్లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో పాటు నటుడు సుమిత్ వ్యాస్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. తమకు కొవిడ్ వైరస్ సోకినట్లు సోషల్‌మీడియా వేదికగా ఇరువురు ప్రకటించారు. ప్రస్తుతం వీరిద్దరూ వైద్యుల సూచన మేరకు హోమ్ క్వారంటైన్లో ఉన్నట్లు వెల్లడించారు.
శుక్రవారం ఒక్కరోజే ముంబయిలో 8,839 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో వైరస్‌కు చేరిన వారి సంఖ్య 5,61,998కి చేరింది.
ఇదీ చూడండి: అతడిని మరో సుశాంత్ కానివ్వకండి: కంగన