వరుస సినిమాలతో జోరు కొనసాగిస్తున్న యువ కథా నాయకుల్లో సంతోష్ శోభన్(manchi rojulu vachayi santosh) ఒకరు. 'ఏక్ మినీ కథ'తో విజయాన్ని అందుకున్న ఆయన, ఇటీవల మారుతి దర్శకత్వంలో(manchi rojulu vachayi 2021 director) 'మంచి రోజులు వచ్చాయి' చేశారు. దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సంతోష్‌శోభన్(manchi rojulu vachayi movie hero name) విలేకర్లతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విషయాలు మీకోసం..
"పని లేనప్పుడు పని దొరికితే, డబ్బు లేనప్పుడు డబ్బొస్తే అదే మంచి రోజు అనుకుంటాం. ఇప్పుడిప్పుడే కొంచెం డబ్బు సంపాదిస్తున్నా. వెనక్కి తిరిగి చూస్తే అప్పట్లో పడిన ఇబ్బందులు బాగున్నాయనిపిస్తోంది. అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో డబ్బు లేదు కానీ, ఆ జీవితాన్ని బాగా ఆస్వాదించేవాళ్లం. గణపతి కాంప్లెక్స్ దగ్గర పునుగులు తింటూ జీవితం గురించి ఆలోచించిన క్షణాలు ఇప్పటికీ గుర్తున్నాయి. విజయం వచ్చిన రోజే మంచి రోజులు అనుకోకూడదు. నా దృష్టిలో ఇబ్బందులు పడ్డ క్షణాలూ మంచివే. మంచి రోజులు అంటే అదొక మైండ్‌సెట్. ఆ రోజులు వచ్చాయని మనం అనుకుంటే వచ్చేసినట్టే".
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఎవరూ బయటికి రాని పరిస్థితుల్లో మీరు ఈ సినిమా కోసం రంగంలోకి దిగారు. భయం అనిపించలేదా?
జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి భయం అనిపించలేదేమో. ఆ సమయంలో మేం అంతా ఆకలిమీద ఉన్నాం. పని చేయడం అవసరం. పని లేకపోతే గడవదు కదా. పైగా యు.వి సంస్థ, మారుతి అన్న కలయికలో సినిమా. సూపర్ అవకాశం కదా అనిపించింది. ఆ ఆత్రుతలోనే ఉన్నాను తప్ప, ఇక భయం అనే ఆలోచనే నాకు రాలేదు. ఇంట్లోవాళ్ల భయాలంటారా? మా అమ్మకి నాకంటే ఎక్కువ సినిమా పిచ్చి (నవ్వుతూ). నేను, మా తమ్ముడు చిత్రీకరణ కోసం వెళ్లామంటే చాలు... మా అమ్మ చాలా సంతోషిస్తారు.
'ఏక్ మినీ కథ' వల్లే ఈ అవకాశం వచ్చిందా?
కచ్చితంగా అంతే(ek mini katha movie hero name). దర్శకుడు మారుతి, నిర్మాత వంశీ అన్న నన్ను నమ్మారు. 'ఏక్ మినీ కథ' అందరికంటే ముందే చూశారు మారుతి. ఆ తర్వాత 'ఒక కథ అనుకున్నా తమ్ముడూ, మనం చేద్దాం' అని చెప్పారు. 'ఏక్ మినీ కథ' విడుదలకు ముందు సగభాగం, విడుదల తర్వాత ద్వితీయార్ధం కథ చెప్పారు. 'ఏక్ మినీ కథ' విజయాన్ని ఆస్వాదించకముందే 'మంచి రోజులు వచ్చాయి' కోసం రంగంలోకి దిగాం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇంతకీ 'మంచి రోజులు వచ్చాయి' ఎలా ఉంటుంది?
మన భయాలు, మన ఆందోళనల చుట్టూ సాగే కథ. తొలి దశ కరోనా సమయంలో మనలో ఎన్ని భయాలో! కొవిడ్ రాకముందే భయపడటం, వచ్చేసిందని నమ్మేయడంలాంటివి అందరం చూశాం. ఎన్ని సమస్యలు వచ్చినా సానుకూల ధోరణిలో ఆలోచించాలి, భయం అనేది అవసరమే కానీ... అది మన జీవితం మొత్తాన్ని ఆవహించేంతలా ఉండకూడదనే అంశాల్ని ఇందులో ఆలోచన రేకెత్తించేలా చెప్పారు దర్శకుడు. అందరికీ కనెక్ట్ అయ్యే విషయాలతోనే నవ్విస్తూ నవ్విస్తూ చివరికి ఓ నిజాన్ని చెప్పడం మారుతి శైలి. ఆయన సినిమా చూసి నవ్వుకున్నా, ఆయన టైమింగ్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించా, ఆయన రాసిన డైలాగులు ప్రాక్టీస్ చేసి చూసుకున్నా. నేను చేసిన ఆ ప్రయత్నమంతా ఈ విశ్వం చూసిందేమో, ఆయన దగ్గరకు నన్ను తీసుకెళ్లి పడేసింది.
కామెడీ కథలో నటించడంపై మీ అనుభవం?
కామెడీ అంటే చాలా ఇష్టం. సున్నితమైన కామెడీ చేయడం నాకు సౌకర్యంగా అనిపించే విషయం. కొత్తరకమైన కథలు ఎంత ఉత్సాహాన్నిస్తాయో, కామెడీ చేస్తున్నప్పుడూ అంతే. అదేమిటో మారుతి అన్నతో పనిచేస్తే అన్నీ సులభంగా అనిపిస్తాయి. సమస్యల్నీ ఎలా మనకు అనుగుణంగా ఎలా మలచుకోవచ్చో మారుతి అన్న పనితీరుని చూసి నేర్చుకున్నా.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కొత్త సినిమాలు ఎంతవరకు వచ్చాయి?
నందినిరెడ్డి దర్శకత్వంలో 'అన్నీ మంచి శకునములే' చేస్తున్నా. 50 శాతంపైగా పూర్తయింది. యు.వి.సంస్థలోనే ఓ కొత్త దర్శకుడితో సినిమా చేస్తా. సుస్మిత కొణిదెల నిర్మాణంలో 'శ్రీదేవి శోభన్‌బాబు' అనే సినిమా చేస్తున్నా. మరికొన్ని కొత్తవి ఉన్నాయి.
నటుడిగా ఇక స్థిరపడినట్టే అనిపించిందా?
ఇక్కడుంటాననే నమ్మకమైతే ఉంది కానీ, స్థిరపడిపోయాం అనే భావన నాలో ఎప్పుడూ రాదు. అలాంటి భావన కలిగితే రిలాక్స్ అయిపోతాం. ఇక్కడ ఎప్పుడూ ఫైట్ చేయాల్సిందే. పరిశ్రమలో ఎప్పుడూ ఒక అదనపు వ్యక్తికి స్థానం ఉంటుంది. మనం రిలాక్స్ అయిపోయిన మరుక్షణం మన అవకాశం మరో వ్యక్తి దగ్గరికి వెళ్లిపోతుంది. ఒక విజయం వచ్చిందంటే దీనికంటే మరో మంచి సినిమా చేయాలనుకోవాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: యాంకర్ సుమ.. సినిమాల్లోకి హీరోయిన్గా ఎంట్రీ!?