ETV Bharat / sitara

పవన్​ కల్యాణ్​తో మంచు విష్ణు.. ఆ వార్తలకు చెక్! - పవన్ కల్యాణ్​తో మంచు విష్ణు

ఇటీవల హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 'అలయ్‌ బలయ్‌'(alai balai 2021) కార్యక్రమానికి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌(pawan kalyan alai balai dattatreya), మంచు విష్ణు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వేదికపై పక్కపక్కనే ఉన్నా విష్ణుతో మాట్లాడటానికి పవన్ సుముఖత వ్యక్తం చేయలేదని పలు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయాన్ని కొట్టిపారేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు విష్ణు. ఇందులో పవన్, విష్ణు మాట్లాడుకుంటూ కనిపించారు.

pawan
పవన్
author img

By

Published : Oct 19, 2021, 4:36 PM IST

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ఎన్నికల్లో(maa elections 2021 winner) విజయం సాధించి అధ్యక్షుడిగా మంచు విష్ణు(manchu vishnu panel) బాధ్యతలు స్వీకరించారు. కాగా, హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 'అలయ్‌ బలయ్‌'(alai balai 2021) కార్యక్రమానికి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, మంచు విష్ణు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వేదికపైన పక్క పక్కనే కూర్చొన్న పవన్‌-విష్ణు(pawan kalyan manchu vishnu)లు మాట్లాడుకోలేదు. దీంతో సామాజిక మాధ్యమాల వేదికగా అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. విష్ణు పక్కనే ఉన్నా పలకరించడానికి పవన్‌ సుముఖత వ్యక్తం చేయలేదని, విష్ణు పలకరించడానికి ప్రయత్నిస్తే పవన్‌ ముఖం తిప్పుకొని వెళ్లిపోయారంటూ పలు వార్తలు వచ్చాయి. వీటిని మంచు విష్ణు టీమ్‌ ఖండిస్తూనే ఉంది. తామిద్దరం మాట్లాడుకొన్నామని విష్ణు స్వయంగా చెప్పారు. తాజాగా ఇదిగో సాక్ష్యం అంటూ వీడియోను పంచుకున్నారు. 'అలయ్ బలయ్‌'కి వచ్చిన పవన్‌-విష్ణు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత ఇరువురు కొద్ది సేపు మాట్లాడుకోవటం కనిపించింది. ఈ వీడియోతో సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలకు మంచు విష్ణు చెక్‌ పెట్టినట్లైంది!

ఇవీ చూడండి: ఆర్జీవీకి మంచు మనోజ్ స్ట్రాంగ్ కౌంటర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.