ETV Bharat / sitara

భారత్​ నుంచి ఆస్కార్​ రేసులో 'జల్లికట్టు' - Oscars 2021 nominations from india

మలయాళ, తెలుగు భాషల్లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న జల్లికట్టు చిత్రం మరో అరుదైన ఘనత సాధించింది. భారత్​ నుంచి ఈ చిత్రం ఆస్కార్​ రేసులో నిలిచింది.

Jallikattu film news
భారత్​ నుంచి ఆస్కార్​ రేసులో 'జల్లికట్టు'
author img

By

Published : Nov 25, 2020, 3:33 PM IST

Updated : Nov 25, 2020, 3:42 PM IST

మలయాళ చిత్రం జల్లికట్టు ఆస్కార్​కు నామినేట్​ అయింది. ఈ విషయాన్ని ఫిల్మ్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా అధికారికంగా ప్రకటించింది. అంతర్జాతీయ ఫీచర్​ ఫిల్మ్​ కేటగిరీలో ఈ చిత్రం పోటీపడుతోంది. 'జోసే పెల్లిస్సరీ' దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆంటోనీ వర్గీస్‌, చెంబన్‌ వినోద్‌ జోసే తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Malayalam film 'Jallikattu'
జల్లికట్టు పోస్టర్​

తెలుగులో ఓటీటీ వేదికగా..

తెలుగులోనూ ఈ చిత్రం ఓటీటీ వేదికగా విడుదలైంది. సెప్టెంబరు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రూ.3కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రూ.20కోట్లు వసూలు చేసింది. టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, బుసాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై విమర్శకుల మెప్పు పొందింది. ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా వేడుకలో 'పెల్లిస్సరీ' ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు.

ఇదీ చూడండి: రివ్యూ: మనిషిలో దాగున్న ఆదిమానవుడి కథే 'జల్లికట్టు'

Last Updated : Nov 25, 2020, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.