సూపర్‌స్టార్ మహేశ్‌బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో మహేశ్ రా ఏజెంట్‌గా కనిపించనున్నారని సమాచారం. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి మరో వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి 'పార్థు' అనే టైటిల్‌ను పెట్టనున్నట్లు నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.
'పార్థు' అనగానే గుర్తొచ్చేది త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అతడు' చిత్రంలో మహేశ్ పాత్ర పేరు. ఇప్పుడిదే పేరును కొత్త చిత్ర టైటిల్‌గా పెట్టాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.
ప్రస్తుతం మహేశ్.. పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నారు. కీర్తిసురేశ్ హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇదీ చూడండి: త్రివిక్రమ్‌తో మహేశ్ 28వ సినిమా ఫిక్స్