సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కుమార్తె సితార.. మరోసారి మెప్పించింది. తండ్రి సినిమాలో 'మైండ్‌బ్లాక్' పాటకు స్టెప్పులేసి అదరగొట్టింది. ఆ వీడియోను నమ్రతా ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం దీనికి అభిమానులు లైకుల వర్షం కురిపిస్తున్నారు.
ఈ ఏడాది సంక్రాంతికి కానుకగా వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు'లోనిదే ఈ గీతం. మహేశ్‌బాబు, రష్మిక ఈ సినిమాలో జంటగా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. దిల్‌రాజు, అనిల్ సుంకర, మహేశ్‌బాబు సంయుక్తంగా నిర్మించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">