మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు(maa elections 2021) తెరపడింది. 2021-23 నూతన కార్యవర్గానికి అధ్యక్షుడిగా మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు(vishnu manchu wins) విజయం సాధించారు. ప్రకాశ్ రాజ్‌తో జరిగిన హోరాహోరీ పోరులో విష్ణును మా సభ్యులు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. మొత్తం 883 మంది ఓటర్లలో 660 ఓట్లు పోలైయ్యాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చరిత్రలోనే అత్యధిక ఓట్లు నమోదైన ఈ ఎన్నికల్లో 107 ఓట్ల ఆధిక్యంతో మంచు విష్ణు(maa elections manchu vishnu panel) మా అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. మా అధ్యక్షుడిగా విష్ణు గెలిచారని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ప్రకటించిన క్షణంలో విష్ణు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ప్రకాశ్ రాజ్‌ను(maa elections prakash raj panel) ఆలింగనం చేసుకొని కంటతడి పెట్టారు. మా ఎన్నికలు ఇంత దూరం వచ్చి ఉండకూడదని అభిప్రాయపడిన విష్ణు... తన విజయాన్ని మోహన్ బాబు విజయంగా పేర్కొన్నారు. ప్రకాశ్ రాజ్ అంటే ఎంతో ఇష్టమన్న విష్ణు.. మేమంతా ఒకే కుటుంబమని కలిసి పనిచేస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో తెలుగు నటీనటుల ఆత్మగౌరవానికి దక్కిన విజయంగా అభివర్ణించారు.
గౌరవిస్తున్నాను
మా ఎన్నికల్లో గెలిచిన విష్ణును అభినందించిన ప్రకాశ్ రాజ్(maa elections prakash)... 650 మంది నటీనటులు తెలుగు బిడ్డను ఎన్నుకున్నందుకు గౌరవిస్తున్నట్లు తెలిపారు.
గతం గతః
మా ఎన్నికల్లో విష్ణును(maa elections manchu vishnu) గెలిపించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన మోహన్ బాబు గతం గతః అంటూ వ్యాఖ్యానించారు. ఇకపై మా అసోసియేషన్ లో వివాదాలకు దూరంగా ఉందామని పిలుపు నిచ్చారు. మా ఎన్నికలు ఇకముందు ఏకగ్రీవంగా జరిగేలా సినీ పెద్దలు చొరవ తీసుకోవాలని సూచించారు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ లాంటి మిత్రుల ఆశీస్సులు తన బిడ్డకు ఉండాలని కోరారు. విష్ణు సాధించిన విజయం సభ్యుల అందరిదని తెలిపారు.
చిరంజీవి అభినందనలు.. నాగబాబు రాజీనామా
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి(maa elections chiranjeevi) సైతం ట్విట్టర్ వేదికగా మంచు విష్ణుకు అభినందనలు తెలిపారు. నూతన కార్యవర్గం నటీనటుల సంక్షేమం కోసం పాటుపడుతుందని ఆశీస్తున్నాన్న చిరంజీవి... మా ఇప్పటికీ ఎప్పటికీ ఒకటే కుటుంబమన్నారు. ఎవరు గెలిచినా కుటుంబం గెలిచినట్టేనని, ఆ స్ఫూర్తితోనే అందరం ముందుకుసాగుదామని పిలుపు నిచ్చారు. విష్ణు గెలిచిన కొన్ని నిమిషాల్లోనే ప్రకాశ్ రాజ్ కు మద్దతుగా నిలిచిన మెగాబ్రదర్ నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేశారు. 48 గంటల్లో తన రాజీనామాను మా అసోసియేషన్ కార్యాలయానికి పంపనున్నట్లు ట్విట్టర్ లో ప్రకటించారు. ప్రాంతీయవాదం, సంకుచిత మనస్తత్వంతో మా అసోసియేషన్ కొట్టుమిట్టాడుతోందని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.
జీవితపై రఘుభాబు
ఈ ఎన్నికల్లో మంచు విష్ణుతోపాటు తన ప్యానల్ నుంచి జనరల్ సెక్రటరీగా రఘుబాబు గెలిచారు. ఉత్కంఠ పోరులో జీవిత రాజశేఖర్ పై 7 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్ గా మాదాల రవి విజయం సాధించగా.... ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్ గెలుపొందారు. కోశాధికారిగా విష్ణు ప్యానెల్ నుంచి పోటీ చేసిన శివబాలాజీ 316 ఓట్లు సాధించి నాగినీడుపై విజయం సాధించారు. మిగతా కార్యవర్గ సభ్యులకు సంబంధించిన ఫలితాలను ఇవాళ ప్రకటించనున్నట్లు ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తెలిపారు.
సంక్షేమానికి కృషి చేయాలి
గత ఆరేళ్లలో ఎప్పుడూ లేనంత ఉత్కంఠగా జరిగిన మా ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరగడం పట్ల క్రమశిక్షణ కమిటీ సభ్యులు, మా మాజీ అధ్యక్షుడు మురళీమోహన్ హర్షం వ్యక్తం చేశారు. గెలిచిన అభ్యర్థులు మా అభివృద్ధికి, సభ్యుల సంక్షేమం కోసం కృషి చేయాలని కోరారు.
మంచు విష్ణు గెలువడం వల్ల ఫిల్మ్ నగర్ లో మోహన్ బాబు అభిమానుల సంబురాలు అంబరాన్ని తాకాయి. కౌంటింగ్ కేంద్రం నుంచి మోహన్ బాబు నివాసం వరకు ర్యాలీ నిర్వహించి బాణాసంచా కాల్చుతూ సంబురాలు జరుపుకున్నారు.
సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పి.జి.విందా
తెలుగు సినిమాటోగ్రాఫర్స్ (ఛాయాగ్రాహకులు) అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పి.జి.విందా గెలుపొందారు. కార్యదర్శిగా బి.వాసు, కోశాధికారిగా భీముడు (శ్రీకాంత్) విజయం సాధించారు. ప్రతిసారీ ఏకగ్రీవంగానే కార్యవర్గాన్ని ఎన్నుకునేవారు. ఈసారి మాత్రం ఎన్నికల్ని నిర్వహించారు. 489 మంది సభ్యులున్న అసోసియేషన్ ఇది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 389 మంది ఓటు హక్కుని వినియోగించుకుని కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ఇదీ చూడండి: 'మా' ఎన్నికల్లో మంచు విష్ణు విజయం