ETV Bharat / sitara

'లవ్​స్టోరి', 'టక్ జగదీష్' రిలీజ్ డేట్స్ ఫిక్స్! - venkatesh narappa release date

తెలుగులో కొత్త సినిమాల సందడి త్వరలో మొదలుకానుంది. జులై 30న థియేటర్లలోకి రానున్న 'తిమ్మరుసు'తో సందడి షురూ కానుంది. అయితే 'లవ్​స్టోరి', 'టక్ జగదీష్' రిలీజ్​ తేదీల విషయమై సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు.

Love story, Tuck jagadish movie release date fixed
మూవీ న్యూస్
author img

By

Published : Jul 9, 2021, 10:20 PM IST

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లకు ప్రభుత్వాలు అనుమతిచ్చినా సరే ఇంకా అవి తెరుచుకోలేదు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు సినిమాలు విడుదల తేదీలపై సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రేక్షకుల ఎంతగానో ఎదురుచూస్తున్న 'లవ్​స్టోరి', 'టక్​ జగదీష్​' తదితర చిత్రాలు ఆరోజు రానున్నాయంటూ మాట్లాడేసుకుంటున్నారు.

కరోనా రెండోదశ తర్వాత థియేటర్లలోకి తీసుకొస్తున్న తొలి సినిమా 'తిమ్మరుసు'. జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే నాగచైతన్య-సాయిపల్లవి 'లవ్​స్టోరి' చిత్రాన్ని ఆగస్టు 7న రిలీజ్​ చేయనున్నారని, నాని 'టక్ జగదీష్'ను ఆ తర్వాత వారం థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మాట్లాడుకుంటున్నారు.

వీటితో పాటే ప్రభాస్ 'రాధేశ్యామ్', వెంకటేశ్ 'నారప్ప', రానా-సాయిపల్లవి 'విరాటపర్వం' తదితర సినిమాల విడుదలపైనా స్పష్టత రావాల్సి ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.