ETV Bharat / sitara

అమ్మతో హెడ్​మసాజ్​ చేయించుకుంటున్న కంగనా - కంగనా న్యూస్​

కరోనా నియంత్రణలో భాగంగా ప్రస్తుతం స్వీయనిర్బంధంలో ఉంది బాలీవుడ్​ క్వీన్​ కంగనా రనౌత్.​ మనాలీలోని తన ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతోంది. తాజాగా కంగనా తల్లితో హెడ్​మసాజ్​ చేయించుకుంటోన్న ఫొటోను నెట్టింట పంచుకుంది.

Lockdown diaries: Kangana gets head massage by mom, fans laud her for 'living real life'
అమ్మ చేత్తో హెడ్​మసాజ్​ చేయించుకుంటున్న కంగనా
author img

By

Published : Apr 4, 2020, 12:54 PM IST

కరోనా లాక్​డౌన్​ కారణంగా తన విలువైన సమయాన్ని కుటుంబసభ్యులతో గడుపుతోంది బాలీవుడ్​ క్వీన్​ కంగనా రనౌత్​. ప్రస్తుతం ఆమె సొంతూరు మనాలీలో సేద తీరుతోంది. కంగనాకు వ్యక్తిగతంగా ఏ సోషల్ మీడియా ఖాతాలు లేవు. కానీ ఆమె బృందం నిర్వహించే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో ఎప్పుడూ టచ్​లో ఉంటుంది. తాజాగా కంగనా తల్లి ఆమెకు హెడ్​ మసాజ్​ చేస్తున్న ఫొటోను కంగనా టీమ్​ ఇన్​స్టాలో షేర్​ చేసింది.

ఈ చిత్రం పలువురు అభిమానులను ఆకర్షించింది. ఆ ఫొటోలో కంగనా సహజంగా ఉందని నెటిజన్లు కొనియాడుతున్నారు. కొంతమంది ఆమెను మెచ్చుకుంటూ సందేశాలు పంపారు.

ప్రపంచమంతా ఎదుర్కొంటున్న కరోనా మహమ్మారిపై ఇటీవలే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది కంగనా. దేశాలన్నీ ఒకదానిపై ఒకటి ఆధిపత్యాన్ని కొనసాగించటానికి ప్రయత్నిస్తున్న చర్యను 'బయోవార్​'గా ఆమె అభివర్ణించింది.

కంగనా రనౌత్​.. ప్రస్తుతం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్​ 'తలైవి', 'ధాకడ్​', 'తేజస్​' చిత్రాల్లో నటిస్తోంది. తేజస్​ సినిమాలో వైమానిక దళ సభ్యురాలి పాత్ర పోషిస్తోంది.

ఇదీ చూడండి.. చిరంజీవి, నాగార్జునను ప్రశంసిస్తూ ప్రధాని ట్వీట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.