ETV Bharat / sitara

మైక్ టైసన్​తో 'లైగర్'​.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్' ఓటీటీ ట్రైలర్ - cinema news

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. లైగర్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్, క్యాలీఫ్లవర్, బదాయి దో, సెహరి చిత్రాల కొత్త సంగతులు ఇందులో ఉన్నాయి.

cinema news
మూవీ న్యూస్
author img

By

Published : Nov 16, 2021, 12:18 PM IST

*విజయ్ దేవరకొండ 'లైగర్'(liger movie release date) అమెరికాలో షెడ్యూల్​ మొదలైంది. మైక్ టైనస్​, విజయ్​పై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ విషయమే చెబుతూ రౌడీ హీరో(vijay devarakonda movies).. టైసన్​తో ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. "దిస్ మ్యాన్ ఈజ్ లవ్. ప్రతి క్షణాన్ని జ్ఞాపకాల్లా మార్చుకుంటాను. ఇదెప్పటికీ గుర్తుండిపోతుంది" అని క్యాప్షన్​ జోడించారు.

.
.

అయితే ఇందులో మైక్ టైసన్(liger movie mike tyson) ఏ పాత్రలో కనిపించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. విజయ్​కు తండ్రి, కోచ్​, ప్రత్యర్థిగా కనిపిస్తారనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్​గా(liger movie heroine) నటిస్తోంది. పూరీ జగన్నాథ్(puri jagannadh movies) దర్శకత్వం వహిస్తున్నారు. పూరీ, ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేలా కనిపిస్తోంది.

*'మోస్ట్​ ఎలిజిబుల్ బ్యాచ్​లర్'(most eligible bachelor ott) ఓటీటీ ట్రైలర్​ విడుదలైంది. ఈ శుక్రవారం(నవంబరు 19) ఆహా ఓటీటీలో రిలీజ్​ కానుందీ సినిమా. ఇందులో అఖిల్, పూజా హెగ్డే(pooja hegde movies) జంటగా నటించారు. పెళ్లి నేపథ్య కథతో దీనిని తెరకెక్కించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అక్కినేని అఖిల్​.. ఈ సినిమాతోనే రూ.100 కోట్ల క్లబ్​లో తొలిసారి చేరారు. ఈ చిత్రంలోని లెహరాయి(lehrayi song), గుచ్చే గులాబి, చిట్టి అడుగు పాటలు అయితే.. ఇప్పటికే శ్రోతల్ని అలరిస్తూనే ఉన్నాయి.

*సంపూర్ణేశ్​బాబు 'క్యాలీఫ్లవర్' టీజర్​(cauliflower telugu movie) వచ్చేసింది. ఇందులో విభిన్న గెటప్​లో కనిపించిన సంపూ.. "ఎనీ టైమ్ శీలాన్ని కాపాడే సింబల్ యే రా ఈ క్యాలీఫ్లవర్!!" అంటూ చెప్పిన డైలాగ్స్​ అలరిస్తూ, నవ్వు తెప్పిస్తున్నాయి. నవంబరు 26న థియేటర్లలోకి ఈ సినిమాను తీసుకురానున్నారు. ఇందులో పోసాని కృష్ణమురళి, 'జబర్దస్త్' రోహిణి, గెటప్​ శీను తదితరులు సహాయ పాత్రలు పోషించారు. ఆర్.కె. మలినేని దర్శకత్వం వహించారు.

*సంగీత దర్శకుడు తమన్ పుట్టినరోజు(thaman birthday) సందర్భంగా.. పలు చిత్రబృందాలు ఆయనకు విషెస్​ చెబుతున్నాయి. ఈ మేరకు పోస్టర్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతమందించిన 'భీమ్లా నాయక్', 'సర్కారు వారి పాట', 'అఖండ', 'గని' విడుదలకు సిద్ధమవుతున్నాయి. త్వరలో థియేటర్లలో ప్రేక్షకుల్ని పలకరించనున్నాయి.

.
.

*బాలీవుడ్ స్టార్స్ రాజ్​కుమార్ రావ్, భూమి పెడ్నేకర్ జంటగా నటిస్తున్న చిత్రం 'బదాయి దో'(badhaai do release date). వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కానుకగా రావాల్సిన ఈ సినిమా రిలీజ్ డేట్​ను ఇప్పుడు మార్చారు. ఫిబ్రవరి 4న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. హర్షవర్ధన్ కులకర్ణి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

.
.
.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.