స్టార్ డైరెక్టర్ రాజమౌళి తీస్తున్న 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ చివరి దశలో ఉంది. రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్‌పై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఇతర తారాగణమూ ఇందులో పాల్గొంటున్నారు. అయితే గతంలో జరిగినట్లే, ఇప్పుడు మరోసారి కొన్ని ఫొటోలు లీకయ్యాయి.

క్లైమాక్స్ ఫైట్ సీన్లకు సంబంధించి తారక్, చరణ్ ఫొటోలు బయటకొచ్చేశాయి. ఇందులో ఎన్టీఆర్ పులితో పోరాటం చేస్తున్నది ఒకటి, చరణ్ బ్రిటీష్ పోలీస్ దుస్తుల్లో ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఈ సినిమాలో రామ్‌చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, జూ.ఎన్టీఆర్.. కొమరం భీమ్‌గా నటిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ, రే స్టీవెన్సన్, అలీసన్ డూడీ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీత దర్శకుడు. డీవీవీ దానయ్య సుమార్ రూ.400 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరు 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

ఇవీ చదవండి: