బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై కర్ణాటకలోని క్యాతసండ్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవలే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు చేసిన ఆందోళనలను తప్పుబట్టే విధంగా నటి ట్వీట్ చేసిందని ఓ న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదును స్వీకరించిన కోర్టు ఆమెపై కేసు నమోదుకు ఆదేశించింది.
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశంలో పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఆందోళనలపై కంగనా రనౌత్ అభ్యంతరకర ట్వీట్ చేసిందని న్యాయవాది ఎల్ రమేశ్ నాయక్ తుమకూరు జిల్లా కోర్టును ఆశ్రయించారు.
న్యాయవాది రమేశ్ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తుమకూరు న్యాయస్థానం సదరు నటిపై కేసు నమోదు చేయాలని అక్టోబరు 10న క్యాతసండ్ర పోలీసులను ఆదేశించింది.