ETV Bharat / sitara

Kriti Sanon: 'ఆదిపురుష్'​ కోసం డైలాగ్స్​ ప్రాక్టీస్​! - కృతిసనన్ ఆదిపురుష్​

బాలీవుడ్​ బ్యూటీ కృతి సనన్(Kriti Sanon)​.. లాక్​డౌన్​ ఖాళీ సమయంలోనూ సినిమాల కోసమే సమయాన్ని వెచ్చిస్తోంది. ప్రస్తుతం తాను నటించబోతున్న 'ఆదిపురుష్​'(Adipurush shooting) డైలాగులను ప్రాక్టీస్​ చేస్తున్నట్లు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

kriti sanon
కృతి సనన్
author img

By

Published : May 30, 2021, 9:38 PM IST

లాక్‌డౌన్(lockdown) స‌మ‌యాన్ని ముంబ‌యిలోని త‌న నివాసంలోనే ఆస్వాదిస్తోంది న‌టి కృతి స‌న‌న్‌(Kriti Sanon). అలా అని స‌ర‌దాగా డ్యాన్సు చేస్తూనో, ఇష్ట‌మైన సినిమాలు చూస్తుంద‌నుకుంటే పొర‌పాటే. ఇటీవ‌ల ఆమె సంత‌కం చేసిన సినిమాల్లోని డైలాగ్స్​ను ప్రాక్టీస్ చేస్తోందట‌ కృతి. ప్ర‌స్తుతం కృతి చేతిలో ఏడు ప్రాజెక్టులున్నాయి. వాటిల్లో ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కుతోన్న 'ఆదిపురుష్'(Adipurush shooting) ఒక‌టి. ఇందులో శ్రీ రాముడిగా ప్ర‌భాస్, సీత‌గా కృతి క‌నిపించ‌నున్నారు. ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఈ సినిమా త‌దుప‌రి షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నాన‌ని, డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్నాన‌ని ఇటీవలే ఓ ఇంట‌ర్వూలో తెలియజేసింది. మ‌రో చిత్రం 'గ‌ణ్‌ప‌త్'(Ganpath) కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాన‌ని చెప్పుకొచ్చింది. ఈ క్లిష్ట స‌మ‌యంలో మ‌న‌మంతా ఒక‌టిగా నిల‌వాల‌ని, మ‌న‌కు సాయంగా నిలిచిన వారికి మ‌నం సాయం చేయాల‌ని అభిమానుల్ని కోరింది.

'1 నేనొక్క‌డినే' చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచయమైంది కృతి. మహేశ్ బాబు హీరోగా సుకుమార్ తెర‌కెక్కించిన చిత్ర‌మిది. త‌ర్వాత నాగచైత‌న్య క‌థానాయ‌కుడిగా వ‌చ్చిన దోచెయ్' చిత్రంలో సంద‌డి చేసింది.

ఇదీ చూడండి.. విజయ్ దేవరకొండ సరసన కృతి సనన్?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.