రామ్ - లింగుస్వామి కాంబినేషన్లోని సినిమా ఇటీవల ఖరారైంది. ఇందులో రామ్‌కు జోడీగా 'ఉప్పెన' భామ కృతిశెట్టి నటించే అవకాశాలున్నాయి. ఈ మేరకు చిత్రబృందం ఆమెను సంప్రదించింది. త్వరలోనే ఈ జోడీ గురించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాస చిట్టూరి ఈ ద్విభాషా చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. మాస్ కథతో, అత్యుత్తమ నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కిస్తున్నట్టు చిత్ర వర్గాలు తెలిపాయి.
ఇది చదవండి: నా నటన చూసి ఏడ్చేశారు: కృతిశెట్టి