ETV Bharat / sitara

నటనకు గుడ్​బై.. వ్యాపారంలోకి అడుగుపెట్టనున్న తార? - కార్తీక నాయర్​ నటనకు గుడ్​బై

అలనాటి హీరోయిన్​ రాధ వారసురాలిగా చిత్రసీమలో అడుగుపెట్టిన కార్తీకా నాయర్​(Karthika Nair).. త్వరలోనే నటనకు గుడ్​బై చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినిమాలకు స్వస్తి చెప్పి వ్యాపార రంగంలో రాణించాలనే ఉద్దేశంతోనే ఆమె ఈ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది.

Kollywood Actress quitting her acting career
నటనకు గుడ్​బై.. వ్యాపారంలోకి అడుగుపెట్టనున్న తార?
author img

By

Published : Jun 25, 2021, 10:02 PM IST

అలనాటి నటి రాధ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్‌గా కొన్ని చిత్రాల్లో నటించారు నటి కార్తీకా నాయర్‌(Karthika Nair). తెలుగులో తెరకెక్కిన 'జోష్‌'(Josh)తో హీరోయిన్‌గా వెండితెరపై మెరిసిన ఈ బ్యూటీ త్వరలోనే నటనకు గుడ్‌బై చెప్పనున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 2009 నుంచి వరుసగా దక్షిణాది చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాకపోవడం వల్లనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

అంతేకాకుండా కార్తీక గత కొంతకాలం క్రితం వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో తన వ్యాపార సంస్థను మరింత అభివృద్ధి చేయాలనే భావనలో ఉన్నారని టాక్‌. దీంతో ఆమె నటనకు స్వస్తి చెప్పనున్నారంటూ నెటిజన్లు అనుకుంటున్నారు.

'జోష్‌' అనంతరం కార్తీక.. 'కో' అనే తమిళ చిత్రంలో నటించారు. అదే చిత్రాన్ని తెలుగులో 'రంగం'(Rangam) పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాలో కార్తీక-జీవా నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన 'దమ్ము'(Dhammu), అల్లరి నరేశ్​ ప్రధాన పాత్రలో నటించిన 'బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి'(Brother of Bommali) చిత్రాల్లో ఆమె కీలకపాత్ర పోషించారు. 2016లో విడుదలైన 'వా డీల్‌' తర్వాత ఆమె ఏ ఇతర ప్రాజెక్ట్‌కు సంతకం చేయలేదు.

ఇదీ చూడండి.. పక్కింటోళ్లను బెదిరించి.. ప్రముఖ నటి పాయల్​ అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.