ETV Bharat / sitara

'కొలవెరి' మ్యూజికల్​ మ్యాజిక్​.. ఓ సంచలనం - music director anirudh special

ప్రతిభకు వయసుతో సంబంధం ఉండదు. సంగీతానికి భాష అవసరం లేదు. 'కొలవెరి' అనే ఒకే ఒక్కపాటతో ఈ రెండింటిని నిజం చేశారు సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌. ఆయన పుట్టినరోజు సందర్భంగా అనిరుధ్ స్వరపరిచిన కొన్ని పాటలు.

anirudh
అనిరుధ్
author img

By

Published : Oct 16, 2020, 6:32 PM IST

అంతర్జాలం అందరికీ అందుబాటులోకి వస్తున్న రోజులవి (2011). 'గంగ్నమ్‌ స్టైల్‌' అంటూ వచ్చిన విదేశీ పాట యూట్యూబ్‌లో కోట్ల వ్యూస్‌తో రికార్డు సృష్టించింది. ఎక్కడ విన్నా, ఎవరిని కదిపినా దీని గురించే చర్చ. అయితే అది అంతర్జాతీయ గుర్తింపు పొందిన పాప్‌ సింగర్, డ్యాన్సర్‌ చేసిన వీడియో కావడం వల్ల అంతగా ప్రాచుర్యం పొందింది. అప్పటి వరకు భారత్‌ తరఫున ఇలాంటి వీడియో రాలేదనే చెప్పొచ్చు. తన సంగీత ప్రతిభతో 21 ఏళ్ల వయసులో తొలి సినిమాతోనే దానికి సమాధానమిచ్చారు సంగీత దర్శకుడు అనిరుధ్‌. 'కొలవెరి' అంటూ ప్రపంచమంతా ఈ పాట గురించి మాట్లాడుకునేలా చేశారు.

తమిళ అగ్ర నటుడు ధనుష్, శ్రుతి హాసన్‌ హీరోహీరోయిన్లుగా నటించిన ప్రేమకథ '3' సినిమా కోసం అనిరుధ్‌ స్వరపరిచిన గీతమిది. అప్పట్లో ఇదో సంచలనం. దీంతో కోలీవుడ్‌లోని అగ్ర కథానాయకులందరికీ సంగీతం అందించేందుకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారారు అనిరుధ్. పవర్​స్టార్ పవన్‌ కల్యాణ్‌ 'అజ్ఞాతవాసి'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, 'జెర్సీ', 'నానీస్‌ గ్యాంగ్‌ లీడర్'లకు సంగీతం అందించి, అలరించారు. ఇలా మొదటి అవకాశంతోనే భాషతో సంబంధం లేకుండా అంతర్జాతీయంగా సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించిన అనిరుధ్‌ పుట్టినరోజు నేడు (అక్టోబరు 16). ఈ సందర్భంగా ఆయన సంగీత సారథ్యంలో వచ్చి శ్రోతలను మైమరపించిన కొన్ని సాంగ్స్ మీ కోసం

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి రవితేజతో చిందేస్తోన్న అప్సర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.