రామ్‌చరణ్ కథానాయకుడిగా, శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ చిత్రంలో కన్నడ నటుడు కిచ్చా సుదీప్ అతిథి పాత్రలో నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా కథతో తీయనున్న ఈ ప్రాజెక్టులో బాలీవుడ్‌తో పాటు తమిళ, కన్నడ చిత్రసీమకు చెందిన పలువురిని నటింపజేసేందుకు నిర్మాణ సంస్థ ఆసక్తి కనబరుస్తోందని సమాచారం.
'ఆర్‌సి 15'వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా జులై 15న సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. సుదీప్ గతంలో రాజమౌళి 'ఈగ'లో ప్రతినాయకుడిగా మెప్పించారు. ‘బాహుబలి’లోనూ అతిథి పాత్రలో సందడి చేశారు. చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’లో అవుకు రాజుగా కనిపించారు. కిచ్చా సుదీప్ ప్రస్తుతం ‘విక్రాంత్ రోనా’లో కథానాయకుడిగా చేస్తున్నారు. ఉపేంద్ర ‘కబ్జా’లోనూ భార్గవ్ బక్షిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే పలు హిందీ సినిమాల్లోనూ నటించి ఆకట్టుకున్నారు.