ETV Bharat / sitara

డేటింగ్​ యాప్స్​లో ఎంట్రీపై కియారా క్లారిటీ - డేటింగ్​ యాప్స్​పై కియారా అడ్వాణీ కామెంట్

బాలీవుడ్​ నటి కియారా అడ్వాణీ డేటింగ్ యాప్​ ఉపయోగిస్తుందంటూ ఇటీవలే సోషల్​మీడియాలో ప్రచారం జరిగింది. ఈ రూమర్లపై కియారా అడ్వాణీ స్పందిస్తూ.. తనకు ఎలాంటి డేటింగ్​ యాప్​లలో ఖాతాలు లేవని స్పష్టం చేసింది. అయితే 'ఇందూ కీ జవానీ' సినిమా కోసం ఆ యాప్​లను పరిశీలించినట్లు వెల్లడించింది.

Kiara Advani clarifies about her Dating app entry
డేటింగ్​ యాప్స్​లో ఎంట్రీపై కియారా క్లారిటీ
author img

By

Published : Dec 7, 2020, 5:00 AM IST

బాలీవుడ్‌ బోల్డ్‌ హీరోయిన్‌ కియారా అడ్వాణీ డేటింగ్‌ యాప్‌ ఉపయోగిస్తోందా..? ఈ మధ్య సోషల్‌ మీడియాలో జరుగుతున్న చర్చ ఇది. ఇటీవల ఆమె నటించిన 'ఇందూ కీ జవానీ' చిత్రమే ఈ అనుమానాలకు కారణం. ఆ సినిమాలో హీరోయిన్‌ ఇందు ఓ డేటింగ్‌ యాప్‌ ఉపయోగిస్తూ ఉంటుంది. ఈక్రమంలో ఆమెకు ఓ పాకిస్థాన్‌ అబ్బాయితో పరిచయం ఏర్పడుతుంది. అయితే.. ఆమె సినిమాలో ఉన్నట్లుగానే నిజజీవితంలోనూ డేటింగ్‌ యాప్‌ వాడుతోందా..? అని చాలామంది పలు డేటింగ్‌ యాప్‌లలో ఆమె పేరుతో వెతుకులాటలు ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. తాను ఎటువంటి డేటింగ్‌ యాప్‌ వాడట్లేదని కియారా స్పష్టం చేసింది.

Kiara Advani clarifies about her Dating app entry
కియారా అడ్వాణీ

"నేను ఇప్పటి వరకూ ఎలాంటి డేటింగ్‌ యాప్‌ వాడలేదు. అసలు డేటింగ్‌ యాప్‌ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. అయితే.. 'ఇందూ కీ జవానీ' సినిమాకు సంతకం చేసిన తర్వాత 'డేటింగ్‌ యాప్స్‌ ఎలా ఉంటాయి..?' అని గూగుల్‌లో వెతికాను. నా స్నేహితుల్లో చాలా మంది డేటింగ్‌ యాప్‌ వాడేవాళ్లు ఉన్నారు. నా బెస్ట్‌ ఫ్రెండ్‌ కూడా డేటింగ్‌ యాప్‌లోనే కలిసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఈ యాప్‌లు వాడేవాళ్లలో చాలామంది నిక్కచ్చిగా ఉంటున్నారు. వారి ఉద్దేశాలూ ఎంతో స్పష్టంగా ఉంటున్నాయి. అయితే.. నేను డేటింగ్‌ యాప్‌లోకి వస్తే మాత్రం అది కేవలం ప్రేమ కోసమే అవుతుంది." - కియారా అడ్వాణీ, బాలీవుడ్​ నటి

కియారా అడ్వాణీ నటించిన 'ఇందూ కీ జవానీ' విడుదలకు సిద్ధంగా ఉంది. అభిర్‌ సేన్‌గుప్తా దర్శకత్వం వహించారు. ఆదిత్య సీల్ కథానాయకుడు. టీ సిరీస్‌, ఎమ్మే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. డిసెంబరు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. 'భరత్‌ అనే నేను', 'వినయ విధేయ రామ' చిత్రాల్లో నటించిన కియారా తెలుగు సినిమా ప్రేక్షకులకూ సుపరిచితురాలే.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.