జీవా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'కీ'. కలీస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ప్రముఖ తెలుగు దర్శకుడు సుకుమార్ దీన్ని విడుదల చేశారు. సాంకేతికతని ఆపడం ఎవరి తరం కాదు అంటూ హెచ్చరిస్తున్న ప్రచార చిత్రం చూస్తుంటే.. సైంటిఫిక్ థ్రిల్లర్గా మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
"మనం వాళ్లని కనిపెట్టలేక పోతే వాళ్లు మనల్ని కనిపెట్టేస్తారు" అనే మాటలతో ప్రారంభమైందీ ట్రైలర్. యువత మెచ్చే అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాకి విశాల్ శేఖర్ సంగీతం అందించారు. హీరోయిన్గా నిక్కి గల్రానీ నటిస్తోంది. ఏప్రిల్ 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.