సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం. ముఖ్యంగా కథానాయికల విషయంలో ఇది ఎంతకాలం ఉంటే అంత బాగా కెరీర్ పరుగులు తీస్తుంది. కెరీర్ ఆరంభంలో 'సన్న'జాజిలా నాజూకుగా ఉన్న భామలు కొందరు తర్వాత బొద్దుగా మారిపోయారు. కొంతకాలానికి తీవ్రమైన కసరత్తులు చేసి మళ్లీ మెరుపుతీగలా మారుతున్నారు. క్రమం తప్పని వ్యాయామం, సరైన ఆహారం తీసుకుంటూ.. అందచందాలకు మెరుగులు అద్దుకొంటున్నారు. కీర్తిసురేష్, నిత్యామేనన్, ప్రియాంక జవాల్కర్, సురభి, వరలక్ష్మీ, శరత్‌కుమార్, అవికాగోర్ తదితరులు ఇందుకు నిదర్శనం.
లాక్‌డౌన్‌కు ముందు వీరంతా బాగా ఒళ్లు చేశారు. ఈ లాక్డౌన్లో చిత్రీకరణలు ఆగిపోయాయి. దీంతో ఇలా దొరికిన విరామాన్ని చక్కగా ఉపయోగించుకొని చూడ చక్కగా మారిపోయారు. యోగా, వాకింగ్, జాకింగ్, రన్నింగ్, జిమ్‌లో కసరత్తులు... ఇలా తమకు నచ్చిన మార్గాన్ని ఎంచుకొని అందమైన శిల్పాల్లా మారిపోయారు. ఓ సారి వారి ఫొటోలపై లుక్కేద్దాం...