'మహానటి' కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'మిస్ ఇండియా'. ఈ చిత్రంలో కీర్తి ఓ బిజినెస్ ఉమెన్‌గా కనిపించనుంది. నరేంద్రనాథ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.
ఇందులో కీర్తి.. సొంతంగా బిజినెస్ చేయాలనే ఆలోచన కలిగిన సంయుక్త అనే పాత్రలో కనిపించింది. అందుకోసం భారతీయ టీని విదేశాల్లో అమ్మేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో తనకు ఎదురైన అడ్డంకులేంటి?, తన ఆశయాన్ని సంయుక్త సాధించిందా?లేదా? అనే స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ సినిమాలో జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్, నరేశ్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ కోనేరు నిర్మిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.