ETV Bharat / sitara

నటి సంజనకు షరతులతో కూడిన బెయిల్ - Sanjjanaa Galrani latest news

డ్రగ్స్​ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నటి సంజనా గల్రానీకి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. డ్రగ్స్ అమ్ముతుందనే ఆరోపణల నేపథ్యంలో ఈమెను సెప్టెంబరులో కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు.​

Kannada actress Sanjjanaa Galrani get bail in Sandalwood Drug scandal
నటి సంజనకు షరతులతో కూడిన బెయిల్
author img

By

Published : Dec 11, 2020, 4:39 PM IST

శాండల్​వుడ్ డ్రగ్స్​ కేసులో అరెస్టయిన నటి సంజనా గల్రానీకి కర్ణాటక హైకోర్టు, శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో నేటి సాయంత్రం లేదంటే శనివారం ఉదయం ఆమె జైలు నుంచి విడుదల కానుంది.

వ్యక్తిగత పూచీకత్తు కింద సంజనా.. రూ.3 లక్షలు బాండ్ల రూపంలో కట్టాలని, నెలకు రెండుసార్లు కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించారు. సోమవారం(డిసెంబరు 14) ఈ నటికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

నిషేధిత డ్రగ్స్​ను అమ్ముతుందనే కారణంతో సంజనను సెప్టెంబరు తొలి వారంలో అరెస్టు చేశారు. అనంతరం ఆమె బెయిల్​ కోసం అర్జీ పెట్టుకోగా, వాటిని కోర్టు తిరస్కరించింది. ఈ కేసుతో సంబంధముందనే ఆరోపణల నేపథ్యంలో నటి రాగిణి ద్వివేదితో పాటు పలువురిని కర్ణాటక పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.