ETV Bharat / sitara

'నా వ్యాఖ్యలతో 'కరోనా ఫ్యాన్స్​' బాధపడొచ్చు!' - కంగనా ట్విట్టర్​ నిషేధం

'క్వీన్​' కంగనా రనౌత్​ కరోనా వైరస్​ నుంచి పూర్తిగా కోలుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అయితే వైరస్​ను జయించిన తన అనుభవాలను పంచుకోవాలని అనుకున్నా.. తన వ్యాఖ్యలతో కరోనా​ ఫ్యాన్స్​ క్లబ్​ మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని తెలిపింది.

Kangana tests COVID-19 negative
కంగనకు కరోనా నెగెటివ్
author img

By

Published : May 18, 2021, 4:14 PM IST

బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ కరోనా వైరస్​ నుంచి కోలుకుంది. మే 8న కొవిడ్​ బారిన పడిన ఆమె.. స్వీయనిర్బంధంలో ఉంటూ తగిన జాగ్రత్తలు పాటిస్తుంది. మంగళవారం చేసిన కొవిడ్​ టెస్ట్​లో నెగెటివ్​గా తేలినట్లు కంగన వెల్లడించింది.

Kangana tests COVID-19 negative; wants to say a lot but told 'not to offend COVID fan club'
కంగనా రనౌత్​ ఇన్​స్టాగ్రామ్​ స్టోరీ

"ఈ రోజు చేసిన కొవిడ్​ పరీక్షలో నాకు కరోనా నెగెటివ్​ వచ్చింది. వైరస్​ను ఎలా ఓడించాననే విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నా. కానీ, కరోనా ఫ్యాన్స్​ క్లబ్​ను కించపరచవద్దని నేను నిర్ణయించుకున్నా. వైరస్​ను అగౌరవపరిస్తే వారు మనస్తాపం చెందుతారు. ఏదీ ఏమైనా నాపై మీరు చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు".

- కంగనా రనౌత్​, బాలీవుడ్​ నటి

ట్విట్టర్​ వేదికగా కంగనా రనౌత్​ ఇటీవలే బంగాల్​ ఎన్నికలపై చేసిన సంచలన వ్యాఖ్యల పట్ల సోషల్​మీడియాలో దుమారం రేగింది. ట్విట్టర్​ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా కంగన ట్విట్టర్​ ఖాతాను శాశ్వతంగా తొలగిస్తున్నట్లు సదరు డిజిటల్​ సంస్థ ప్రకటించింది. ఆ తర్వాత కరోనా బారిన పడిన కంగన.. వైరస్​ ఒక ఫ్లూ లేదా జ్వరం వంటిదేనని ఇన్​స్టాగ్రామ్​ పోస్ట్​ పెట్టింది. దీనిపై స్పందించిన ఇన్​స్టా ఆమె చేసిన పోస్ట్​ను తొలగించింది.

కంగనా రనౌత్.. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్​ 'తలైవి'లో నటిస్తోంది. ఇందులో ఆమె జయలలిత పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు 'తేజస్'​, 'ధాకడ్​' వంటి చిత్రాలతో బిజీగా ఉంది.

ఇదీ చూడండి.. కరోనాతో అగ్రహీరోల మేకప్​మ్యాన్​ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.