అక్రమ కట్టడం పేరుతో తన ఇంటికి కూల్చారంటూ ప్రభుత్వంపై విమర్శలు చేసింది బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించింది. మాహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశిస్తూ.. "ఈ రోజు మీరు నా ఇంటిని కూల్చేశారు. రేపు మీ పొగరు అణుగుతుంది" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
మాఫియా సాయంతో శివసేన పార్టీ.. తన కార్యాలయాన్ని ధ్వంసం చేసిందని ఆరోపించింది. అన్నీ ఒకే రోజులు కాదని.. భవిష్యత్తులో కచ్చితంగా పరిస్థితులు మారతాయని పేర్కొంది.
ఈ క్రమంలోనే 'అయోధ్య'పైనే కాకుండా.. 'కశ్మీరీ పండిట్ల'పై కూడా సినిమా తీస్తానని కంగన స్పష్టం చేసింది.
-
तुमने जो किया अच्छा किया 🙂#DeathOfDemocracy pic.twitter.com/TBZiYytSEw
— Kangana Ranaut (@KanganaTeam) September 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">तुमने जो किया अच्छा किया 🙂#DeathOfDemocracy pic.twitter.com/TBZiYytSEw
— Kangana Ranaut (@KanganaTeam) September 9, 2020तुमने जो किया अच्छा किया 🙂#DeathOfDemocracy pic.twitter.com/TBZiYytSEw
— Kangana Ranaut (@KanganaTeam) September 9, 2020
"నా దేశ ప్రజలను మేల్కొల్పడానికి కచ్చితంగా కశ్మీరీ పండిట్లపై సినిమా తీస్తానని వాగ్దానం చేస్తున్నా. ఇలాంటి సంఘటన జరుగుతుందని నాకు ముందే తెలుసు. ఉద్దవ్ ఠాక్రే ఇది ఒకరకంగా మంచిదే".
కంగనా రనౌత్, సినీ నటి
బీఎంసీ అధికారులు కంగన ఇంటి కూల్చివేత పనులు చేస్తుండగా.. నటి కోర్టును ఆశ్రయించింది. అనంతరం కూల్చివేతపై స్టే విధించింది న్యాయస్థానం.
ఇటీవలే ముంబయి పోలీసులు, మహారాష్ట్ర గురించి కంగనా వివాదాస్పదన వ్యాఖ్యలు చేసింది. దీంతో శివసేన నేత సంజయ్ రౌత్, ఆమెకు ముంబయిలో అడుగుపెట్టేందుకు హక్కు లేదని అన్నారు. వాటికి కంగన స్పందిస్తూ.. ఇది తనను బహిరంగంగా బెదిరించడమేనని.. ముంబయి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లా(పీఓకే) అనిపిస్తోందని పేర్కొంది.
ఈ క్రమంలోనే ముంబయికి వస్తానని వీలైతే ఆపుకోమని సవాలు విసిరింది. బుధవారం చెప్పిన మాట ప్రకారం ముంబయిలో అడుగుపెట్టింది.