ETV Bharat / sitara

Kamal hassan: 'విక్రమ్' వచ్చేస్తున్నాడు.. మేకింగ్​ వీడియో అదిరింది!

author img

By

Published : Mar 14, 2022, 7:26 AM IST

Updated : Mar 14, 2022, 12:06 PM IST

Kamal hassan Vikram release date: దిగ్గజ నటుడు కమల్​హాసన్​ నటించిన 'విక్రమ్'​ సినిమా రిలీజ్​ డేట్​ ఖరారైంది. 2022 జూన్​ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ స్పెషల్​ వీడియోను రిలీజ్​ చేసింది చిత్రబృందం.

Kamalhassan Vikram released on 2022 June 3
కమల్​హాసన్​ 'విక్రమ్' రిలీజ్​ డేట్​ ఫిక్స్​

Kamal hassan Vikram release date: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు 'విక్రమ్'​ చిత్రబృందం శుభవార్త తెలిపింది. యూనివర్సల్​ స్టార్​ కమల్​హాసన్​ నటించిన ఈ మూవీని 2022 జూన్​ 3 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్​ చేయనున్నట్లు తెలిపింది. దీంతో పాటే 'మేకింగ్​ గ్లింప్స్'​ పేరుతో ఓ స్పెషల్​ వీడియోను విడుదల చేసింది. ఇందులో భారీ యాక్షన్​ సీన్స్​ను తెరకెక్కిస్తున్నట్లు చూపించారు. కమల్​, విజయ్​, ఫహాద్​ ఈ వీడియోలో కనిపించారు.

రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై మహేంద్రన్‌తో కలిసి కమల్‌ ఈ సినిమాను నిర్మించారు. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకుడు. విలక్షణ నటుడు విజయ్​ సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్‌, కాళిదాస్‌ జయరాం ముఖ్య పాత్రలు పోషించారు.

భారీ యాక్షన్​ థ్రిల్లర్​గా రూపొందుతున్న ఈ సినిమాకు అనిరుధ్‌ స్వరాలందించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని కమల్​ కిల్లింగ్​ లుక్స్​, 'ఫస్ట్‌ గ్లాన్స్‌' ఫ్యాన్స్​ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అనిరుధ్‌ ఇచ్చిన నేపథ్య సంగీతం సరికొత్తగా, అద్భుతంగా ఉంది. 110 రోజుల పాటు ఈ మూవీ షూటింగ్​ జరుపుకుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: మహీంద్రా ఆఫీస్​లో 'ప్రాజెక్ట్​ కె'.. తొలి భారతీయ చిత్రంగా 'ఆర్​ఆర్​ఆర్​'

Last Updated : Mar 14, 2022, 12:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.