స్టార్ హీరో కమల్‌హాసన్ స్వీయనిర్మాణంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా 'విక్రమ్'(kamlahassan vikram movie). ఈ చిత్రంలో కమల్‌తో పాటు విజయ్‌సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కూడా నటిస్తున్నారు(vijay sethupathi in vikram kamal movie). ఇప్పటికే ఈ చిత్ర టీజర్ విడుదలై అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఆయన మరో బడా చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. మల్టీస్టారర్‌గా ఇది తెరకెక్కనుందట. ఇందులో స్టార్ హీరోలు విజయ్‌సేతుపతి, విక్రమ్ కలిసి నటిస్తారని సమాచారం.
ఈ మూవీని ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కించనున్నారని, ప్రస్తుతం కథ సిద్ధం చేస్తున్నారని కోలీవుడ్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. కాగా, విజయ్‌సేతుపతి ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్బిజీగా ఉన్నారు. వాటిలో 'కాతువక్కుల రెండు కాదల్', 'విక్రమ్', 'గాంధీ టాక్స్', 'ముంబైకర్', 'మామనిథన్' సహా పలు సినిమాలు ఉన్నాయి(vijay sethupati movies list). ఇక విక్రమ్ కూడా 'కోబ్రా', 'మహాన్', 'మహవీర్ కర్ణ', 'పొన్నియన్ సెల్వన్' చిత్రాల్లో నటిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: 'జైభీమ్' రికార్డు.. కొత్త రిలీజ్ డేట్‌తో 'గంగూబాయ్'