రెబల్‌స్టార్ ప్రభాస్ కాజల్ అగర్వాల్ జోడీకి హిట్ అండ్ లవ్లీ పెయిర్ అని గుర్తింపు ఉంది. వారిద్దరూ కలిసి రెండు సినిమాల్లోనే నటించినా, అభిమానుల మనసుల్లో మాత్రం అలా ఉండిపోయారు. డార్లింగ్(2010), మిస్టర్ ఫర్ఫెక్ట్(2011) మాత్రమే జంటగా చేసిన వీరిద్దరూ.. దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి తెర పంచుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. అది 'సలార్' చిత్రం కోసమని తెలుస్తోంది.
కాజల్ ఈ ఆఫర్‌కు ఒప్పుకొంటుందా?
'సలార్'లోని ప్రత్యేక గీతం కోసం చిత్రబృందం కాజల్‌ను సంప్రదించిందని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అయితే పెళ్లి తర్వాత పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కాజల్.. ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తుందా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో నిజం ఎంతనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ప్రశాంత్ నీల్ సినిమా.. స్పెషల్ సాంగ్
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'కేజీఎఫ్'లో స్టార్ హీరోయిన్ తమన్నా స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది. హిందీ వెర్షన్లో మౌనీ రాయ్ స్టెప్పులతో అదరగొట్టింది. మరి సలార్‌లో ప్రత్యేక గీతం ఉండే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. మరి అందులో ప్రభాస్‌తో కాలుకదిపే ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి.
కాజల్ బిజీ బిజీ
ప్రస్తుతం కాజల్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. బిజినెస్‌మ్యాన్ గౌతమ్‌ను పెళ్లి చేసుకున్న ఆమె.. అంతకంటే ముందు ఒప్పుకొన్న చిత్రాలనే కరోనా కారణంగా ఇంకా పూర్తిచేయలేదు. కాజల్ హీరోయిన్గా నటించిన 'ఇండియన్ 2'(తమిళం) మధ్యలోనే ఆగిపోయింది. 'ప్యారిస్ ప్యారిస్'(తమిళం) రెండేళ్ల నుంచి రిలీజ్ కాక ఇబ్బందులు పడుతోంది. వీటితో పాటు చిరంజీవి ఆచార్య(తెలుగు), హే సినామిక, ఉమ సినిమాల్లో నటిస్తోంది.
సలర్ సంగతులు
యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న 'సలార్'లో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్గా చేస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇవీ చదవండి: