కథానాయిక కాజల్ అగర్వాల్(Kajal Aggarwal Latest News) తన అభిమానులకు ఓ తీపి కబురు చెప్పబోతుందనే వార్త ఇప్పుడు తెగ వినిపిస్తోంది. గతేడాది అక్టోబర్ 30న ముంబయిలో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను(Kajal Aggarwal Husband) పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆమె తల్లి కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఉంచిన ఎమోజీలే అందుకు ఉదాహరణ అని అభిమానులు భావిస్తున్నారు.
వివాహం అనంతరం ఈ ఏడాది తెలుగులో 'మోసగాళ్లు', హిందీలో 'ముంబయి సాగా' చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది కాజల్(Kajal Aggarwal Movies). తల్లి కాబోతున్న సందర్భంగా విశ్రాంతి తీసుకోవాలని నిశ్చయించుకున్న కాజల్.. ప్రస్తుతం చిరంజీవి-కొరటాల శివ 'ఆచార్య'(Acharya Movie Telugu) చిత్రంలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ త్వరగా పూర్తి చేయాల్సిందిగా మేకర్స్‌ను కోరిందట. ఇప్పటికే ఆమె నటించిన మూడు తమిళ చిత్రాలతో పాటు హిందీ చిత్రం 'ఉమ' సైతం షూటింగ్ పూర్తి చేసుకున్నాయి.
అయితే ఇదే విషయంపై కాజల్ నుంచి ఎటువంటి క్లారిటీ రాలేనప్పటికీ.. త్వరలోనే ఈ జంట కలిసి అధికారికంగా ప్రకటిస్తారనే మాట వినిపిస్తుంది.
ఇదీ చదవండి: 'మా ప్రేమ పెళ్లి.. ఓ సినిమా కథ అవుతుంది'