ETV Bharat / sitara

'పెళ్లి తర్వాత జీవితం అద్భుతంగా ఉంది' - డిజిటల్ రంగంలోకి కాజల్ అగర్వాల్

వ్యాపారవేత్త, తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను ఇటీవల వివాహం చేసుకుంది నటి కాజల్ అగర్వాల్. పెళ్లి తర్వాత తన జీవితం ఎంతో అద్భుతంగా మారిందని అంటోంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు పంచుకుందీ ముద్దుగుమ్మ.

Kajal Aggarwal
కాజల్
author img

By

Published : Feb 12, 2021, 3:51 PM IST

ప్రముఖ వ్యాపారవేత్త, తన స్నేహితుడు గౌతమ్‌ కిచ్లూను వివాహం చేసుకున్నాక తన జీవితం ఎంతో అద్భుతంగా మారిందని నటి కాజల్‌ అగర్వాల్‌ తెలిపింది. వివాహం తర్వాత కూడా వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ బిజీగా ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే డిజిటల్‌ రంగంలోకి అడుగుపెట్టింది. వెంకట్‌ప్రభు దర్శకత్వం వహించిన 'లైవ్‌ టెలికాస్ట్‌' సిరీస్‌లో కాజల్‌ భాగమైంది. హాట్‌స్టార్‌ వేదికగా తాజాగా ఈ సిరీస్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి స్పందించింది.

"వివాహం తర్వాత నా జీవితం ఎంతో అద్భుతంగా మారింది. వృత్తిపరమైన జీవితాల్లో మేమిద్దరం ఎప్పుడూ బిజీగానే ఉంటుంటాం. కానీ, ఒక్కసారి ఇంటికి రాగానే మిగిలిన విషయాలను మర్చిపోయి మేమిద్దరం సరదాగా గడపాలని నిర్ణయించుకున్నాం. వివాహం తర్వాత నాతో కొంత సమయం గడపడానికి ఎప్పుడైనా గౌతమ్‌ సెట్‌కు వస్తే అక్కడ ఉన్నవారందరూ ఆయనను గౌరవించడం, ఒక కుటుంబసభ్యుడిలా చూసుకోవడం నాకెంతో సంతోషాన్నిస్తోంది"

"మా పెళ్లి కార్డులపై 'కిచ్డ్‌' అనే పేరే వాడాం. దాంతో ఇటీవల మేము ప్రారంభించిన హోమ్‌ డెకోర్‌ బ్రాండ్‌కు కూడా అదే పేరు పెట్టాం. ఈ బ్రాండ్‌ నుంచి ఎన్నో గృహోపకరణాలను విడుదల చేయనున్నాం. దీనితోపాటు మరో గేమింగ్‌ కంపెనీలో కూడా నేను వాటా కొనుగోలు చేశాను" అని కాజల్‌ వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.