రాక్షస బల్లులు మరోసారి వెండితెరపై బీభత్సం సృష్టించడానికి రాబోతున్నాయి. అది ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే 'జురాసిక్ వరల్డ్: డొమినియన్' వచ్చేవరకూ ఆగాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన 'జురాసిక్ పార్క్' ఫ్రాంఛైజీలో తెరకెక్కుతున్న ఆరో చిత్రమిది. గత చిత్రాలను మరిపించే రీతిలో ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కనుంది. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిత్ర దర్శకుడు కొలిన్ ట్రెవొరే ట్విట్టర్లో క్లాప్‌బోర్డ్ ఫొటోను పోస్ట్ చేశాడు.
ఇదే ఫ్రాంఛైజీలో 2015లో వచ్చిన 'జురాసిక్ వరల్డ్' చిత్రానికీ కొలిన్ దర్శకుడిగా వ్యవహరించాడు. ఆ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించిన క్రిస్‌ప్రాట్, బ్రిస్ డల్లాస్ హొవార్డ్ తదితరులు ఈ కొత్త చిత్రంలో మళ్లీ అవే పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సిరీస్‌లో తొలి రెండు చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్... ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 11న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం.
ఇదీ చూడండి.. పవన్‌తో తొలిసారి.. హరీశ్‌తో మూడోసారి!