ETV Bharat / sitara

ఎన్టీఆర్ బర్త్​డే: తాతకు తగ్గ మనవడు.. నందమూరి వారసుడు - ఎన్టీఆర్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్

నటన, డైలాగ్స్, డ్యాన్స్​, ఫైట్స్.. ఇలా అన్ని విభాగాల్లో తనదైన మార్క్​ చూపించిన జూ.ఎన్టీఆర్, టాలీవుడ్​లోని అగ్రహీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నారు. ఎన్నో మంచి చిత్రాలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుని, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ​తారక్ పుట్టినరోజు సందర్భంగా అతడి జీవిత విశేషాలు మీకోసం.

JR.NTR BIRTHDAY SPECIAL
ఎన్టీఆర్ బర్త్​డే
author img

By

Published : May 20, 2021, 5:31 AM IST

ఔను .. ఆ తాత పేరే తనది. అచ్చు గుద్దినట్లు తాత పోలికలూ తనవే. సినీ జగమెరిగిన ఆ తాతను ప్రతి భంగిమలోనూ ఆవహించుకుని.. ఆ ఆవాహనే అదృష్టంగా పరిణమించి తెలుగు సినిమాలో తిరుగులేని ఈ తరం కథానాయకుడిగా ఎదిగిన ఓ మనవడి కథ ఇది. అలనాటి తాత నట వైభవాన్ని చూస్తూ పెరిగిన ఒకప్పటి ప్రేక్షకుల నుంచి.. నేటి తరం వీక్షకుల వరకూ ఎన్టీఆర్ పేరు చిరపరిచితం. నాటి ఎన్టీఆర్ నట కీర్తికి కొనసాగింపు జూనియర్ ఎన్టీఆర్. ఈ తరం మోస్ట్ ఎనర్జటిక్ హీరోగా రసజ్ఞులైన అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సొంతం చేసుకున్నారు. అతడి 39వ పుట్టినరోజు(మే 20) సందర్భంగా అతడి జీవిత విశేషాలు మీకోసం.

వ్యక్తిగతం

జూ.ఎన్టీఆర్.. నందమూరి హరికృష్ణ, షాలిని దంపతులకు 1983 మే 20న హైదరాబాద్ మెహదీపట్నంలో పుట్టారు. విద్యారణ్య హైస్కూల్​లో చదివారు. సెయింట్ మేరీ కాలేజ్​లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత లక్ష్మీ ప్రణతిని వివాహమాడారు. వీరికి ఇద్దరు పిల్లలు. అభయ్ రామ్, భార్గవ్ రామ్.

NTR LAKSHMI PRANATHI
తన భార్య లక్ష్మీ ప్రణతితో ఎన్టీఆర్

బహుముఖ ప్రజ్ఞ

ఎన్టీఆర్ కూచిపూడి డ్యాన్సర్. సినీ నటుడు. టెలివిజన్ షో నిర్వాహకుడు. నేపథ్య గాయకుడు. ఇలా అభిరుచి ఉన్న అన్ని రంగాల్లోనూ కృషి చేస్తూ బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తున్నారు. బాల్యంలో కూచిపూడి నాట్యంలో శిక్షణ పొందడం ఆయన నట జీవితానికి ఎంతగానో పనికి వచ్చింది. సినిమాల్లో సూపర్​ డ్యాన్సర్​గా, డైలాగ్ కింగ్​గా, వెరసి ఎన్టీఆర్, అభిమానులు మనసుల్లో చోటు సంపాదించారు.

NTR
ఎన్టీఆర్

తాతే పెట్టిన పేరు

కుటుంబంలో ఏర్పడిన కొన్ని అనివార్య కారణాలతో 11 ఏళ్ల వరకూ తాత ఎన్టీఆర్​ను కలుసుకునే అదృష్టం జూ.ఎన్టీఆర్​కు కలగలేదు. ఓ రోజు మనవడిని చూడాలని ఉందంటూ స్వర్గీయ ఎన్టీఆర్ కబురు పంపడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ, తల్లి షాలిని ఎంతో సంబరపడ్డారు. వెనువెంటనే తాత గారి దగ్గరికి తీసుకెళ్లారు. అచ్చం తన పోలికతోనే ఉన్న మనవడిని చూసి పులకించి పోయిన ఎన్టీఆర్ ఆ కుర్రాడికి తనపేరు పెట్టారు. దాంతో.. అప్పటి నుంచి నందమూరి తారక రామారావుగా ప్రాచుర్యంలోకి వచ్చారు.

NTR
ఎన్టీఆర్

భరతుడిగా తొలి అవకాశం

1991లో ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా తీస్తున్నారు. అందులో మనవడికి భరతుడి వేషం ఇచ్చి ప్రోత్సహించారు. స్వయంగా తానే మేకప్ వేసి ఎలా నటించాలో మెళకువలు నేర్పారు. ఆ సినిమాతో జూనియర్ తెరంగేట్రం చేశారు.

1996లో వచ్చిన 'బాల రామాయణం'లో శ్రీరాముడిగా జూ.ఎన్టీఆర్ నటించారు. చూసి చూడగానే ఆకట్టుకునే రూపంతో ప్రతి ఒక్కరి అభిమానానికి పాత్రులయ్యారు తారక్. ఉత్తమ బాలల చిత్రంగా బాల రామాయణం జాతీయ పురస్కారాన్ని అందుకుంది. ఈ చిత్రంలో నటించినవారంతా చిన్నారులే. సుమారు 3 వేల మంది ఇందులో నటించడం విశేషం.

యువ హీరోగా 'నిన్ను చూడాలని'

అభిరుచి గల చిత్రాలు నిర్మించడంలో ఉషా కిరణ్ మూవీస్​కు ప్రత్యేకత ఉంది. ఎందరో కొత్త హీరోలను పరిశ్రమకు పరిచయం చేసిన చరిత్ర ఉన్న ఉషా కిరణ్ సంస్థ నిర్మాణంలో 'నిన్ను చూడాలని' సినిమాతో యువహీరోగా జూ.ఎన్టీఆర్ కూడా పరిచయం అయ్యారు. కొత్త సినిమా చేయాలని ఆ సంస్థ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్న తరుణంలో దర్శకుడు రాఘవేంద్రరావు జూనియర్ ఎన్టీఆర్ గురించి నిర్మాత రామోజీరావు దృష్టికి తెచ్చారు. తారక్ అంతకుముందు నటించిన బాలరామాయణం గురించి ప్రత్యేక ప్రస్తావన వచ్చింది. ఎన్టీఆర్ మనవడు, బాలరామాయణం కథానాయకుడైన జూనియర్ ఎన్టీఆర్ గురించి రామోజీరావు విని ఉండటం వల్ల వెంటనే ఆయన్ని సినిమాలోకి తీసుకున్నారు.

NTR
ఎన్టీఆర్

దర్శకుడు వి. ఆర్. ప్రతాప్ ఈ సినిమాను రొమాంటిక్ డ్రామాగా మలిచారు. 2001లో నిర్మితమైన ఈ సినిమా ఎన్టీఆర్​కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తాతను తలపించేలా ఉన్నాడనే ప్రశంసలు ఆయనకు దక్కాయి. అదే సంవత్సరం రాజమౌళి దర్శత్వంలో 'స్టూడెంట్ నంబర్ 1' చిత్రంలో కథానాయకుడిగా జూ.ఎన్టీఆర్ పనిచేశారు. తన గురువైన రాఘవేంద్రరావు.. హీరోగా జూనియర్ ఎన్టీఆర్​ను తీసుకోమని చెప్పినప్పుడు ఆయన్ని చూసిన రాజమౌళి అసంతృప్తి వ్యక్తం చేశారట. కారణం.. ఎన్టీఆర్ లావుగా ఉండడమే. తన చిత్రంలో హీరో సన్నగా, స్మార్ట్​గా ఉండాలని భావించినా .. రాఘవేంద్రరావు చెప్పడం వల్ల సర్దుకుని ఆ చిత్రం చేశారు. అయితే.. ఆ చిత్రం అటు రాజమౌళికి, ఇటు జూనియర్ ఎన్టీఆర్​కు పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఎంతగానో ఉపయోగపడింది.

ఎన్టీఆర్​తో రాజమౌళి హ్యాట్రిక్

2001లో 'స్టూడెంట్ నంబర్ వన్' తీసిన రాజమౌళి ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్​తో హ్యాట్రిక్ కొట్టారు. 2003లో 'సింహాద్రి', 2007లో 'యమదొంగ'లాంటి బ్లాక్​బాస్టర్ చిత్రాలు తెరకెక్కించారు. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' టైటిల్​తో తారక్, రామ్ చరణ్ హీరోలుగా మరో ప్రతిష్ఠాత్మక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పరిశ్రమలో తనకు ఇష్టమైన హీరో జూ.ఎన్టీఆర్ అని బహిరంగంగానే రాజమౌళి ప్రకటించడం విశేషం.

NTR
ఎన్టీఆర్

నేపథ్య గాయకుడిగా

జూనియర్ ఎన్టీఆర్ నేపథ్య గాయకుడిగానూ ప్రతిభ కనబరుస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీత దర్శకత్వంలో 'యమదొంగ' సినిమాలో 'ఓలమ్మి తిక్కరేగిందా?' అన్న పాటకు గళం ఇచ్చారు. ఈ పాట తన తాతగారు ఎన్టీఆర్​పై అప్పట్లో దర్శకుడు రాఘవేంద్రరావు 'యమగోల' సినిమా కోసం చిత్రీకరించినది. మణిశర్మ సంగీత దర్శకత్వంలో 'కంత్రీ' సినిమా కోసం 'వన్ టూ త్రి నేనొక కంత్రీ', దేవిశ్రీ ప్రసాద్ దర్శకత్వంలో 'అదుర్స్' చిత్రం కోసం 'చారీ' అన్న పాటకు, నాన్నకు ప్రేమతో సినిమా కోసం 'ఫాలో...ఫాలో' అన్న పాటకు గళమిచ్చారు. ఎస్. తమన్ సంగీత దర్శకత్వంలో 'రభస' కోసం 'రాకాసి...రాకాసి' అనే పాటను ఆలపించారు. తమన్ కన్నడంలో సంగీతం సమకూర్చిన చిత్రం 'చక్రవ్యూహ' కోసం 'చెలియా..చెలియా' అన్న పాటను జూనియర్ ఎన్టీఆర్ పాడారు.

NTR BIRTHDAY FACTS
ఎన్టీఆర్

అవార్డులు-పురస్కారాలు

జూనియర్ ఎన్టీఆర్ చిత్రసీమలో కనబరిచిన ప్రతిభకు అనేక అవార్డులు, పురస్కారాలు దక్కించుకున్నారు. 'బాల రామాయణం' మొదలుకొని 'జై లవకుశ' వరకు పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను ఎన్టీఆర్ సొంతం చేసుకున్నారు.

టెలివిజన్ కెరీర్

సినిమాలో ఎంతో బిజీగా ఉన్నా సరే 'బిగ్ బాస్' రియాల్టీ షోకు హోస్ట్​గా వ్యవహరించి, తెలుగు రాష్ట్రాల్లోని ఇంటిఇంటికీ చేరువయ్యారు. ఇప్పుడు 'మీలో కోటీశ్వరుడు ఎవరు?'తో మరోసారి టీవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.