ETV Bharat / sitara

స్టార్‌ హీరో సినిమా షూట్‌పై రాళ్ల దాడి - attack movie shooting disrupted

బాలీవుడ్​ హీరో జాన్​ అబ్రహం నటిస్తోన్న 'ఎటాక్'​ సినిమా చిత్రీకరణపై రాళ్ల దాడికి పాల్పడ్డారు అక్కడి స్థానికులు. అసలేం జరిగిందంటే?

abraham
అబ్రహం
author img

By

Published : Feb 23, 2021, 2:22 PM IST

బాలీవుడ్‌లో ఓ స్టార్‌హీరో నటిస్తున్న సినిమా చిత్రీకరణపై రాళ్ల దాడి జరిగింది. బీటౌన్‌లో యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకొనే జాన్‌ అబ్రహం హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఎటాక్‌'. లక్ష్యరాజ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ధనిపూర్‌లో ప్రారంభమైంది. జాన్‌ అబ్రహంపై పలు యాక్షన్‌ సన్నివేశాలు, బాంబ్‌ బ్లాస్ట్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తున్నారు.

కాగా, ఈ సినిమా చిత్రీకరణ గురించి తెలుసుకున్న స్థానికులు పెద్దసంఖ్యలో లొకేషన్‌ వద్దకు చేరుకున్నారు. చిత్రబృందాన్ని చూసేందుకు అత్యుత్సాహం ప్రదర్శించారు. తమను అడ్డుకున్న భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా లొకేషన్‌లోకి రాళ్లు రువ్వారు. దీంతో పలువురు సెక్యూరిటీ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో జాన్‌ అబ్రహంకు ఎలాంటి గాయాలు కాలేదు. ఇక, రకుల్‌ప్రీత్‌ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇదీ చూడండి: షూటింగ్​లో గాయపడ్డ బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.