బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ప్రస్తుతం 'అటాక్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇతడు గాయపడ్డాడు. ఈ విషయాన్ని అబ్రహం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు. ఆ సన్నివేశానికి సంబంధించిన ఫొటోతో పాటు గాయాన్ని కాటన్‌తో తడుస్తున్న వీడియోను షేర్ చేశాడీ హీరో. "అలా మొదలైంది. ఇలా కొనసాగుతోంది" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
జాన్ అబ్రహం త్వరలోనే 'సత్యమేవ జయతే 2' చిత్రంతో థియేటర్లలో సందడి చేయనున్నాడు. 2018లో వచ్చిన యాక్షన్ డ్రామా 'సత్యమేవ జయతే'కు సీక్వెల్ ఇది. మిలాప్ జవేరీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మనోజ్ బాజ్‌పేయ్, దివ్యా ఖోస్లా కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.