హీరోలంతా ఈ మధ్య ఎక్కువగా రీమేక్ చిత్రాలపై దృష్టి పెడుతున్నారు. తెలుగులో వచ్చిన 'అర్డున్రెడ్డి' సినిమాను హిందీలో 'కబీర్ సింగ్'గా తెరకెక్కించారు. అక్కడ కలెక్షన్ల వర్షం కురిపించిందీ చిత్రం. ఇందులో కబీర్‌సింగ్‌గా మెప్పించాడు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్. ఇప్పుడు మరో తెలుగు చిత్రం 'జెర్సీ'ని రీమేక్ చేస్తున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
వచ్చే నెల 2 నుంచి చంఢీగడ్‌లోని క్రికెట్ స్టేడియంలో షూటింగ్ ప్రారంభం కానుంది. కొద్దిరోజుల పాటు అక్కడే చిత్రీకరణ జరుపుకోనుంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
బాలీవుడ్‌లో ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, దిల్‌రాజు, అమన్ గిల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చదవండి:'మా' నుంచి తప్పుకోవడానికైనా సిద్ధమే: నరేష్