నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'జాతి రత్నాలు'. అనుదీప్ దర్శకుడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా టీజర్ నేడు (శుక్రవారం) విడుదలైంది.
ముగ్గురు యువకుల జీవితంలో 'లైఫ్ అండ్ డెత్' పరిస్థితి ఏర్పడటానికి కారణం ఏంటి? దాన్ని వాళ్లు ఎలా ఎదుర్కొన్నారు? చివరకు ఆ సమస్య నుంచి బయటపడ్డారా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఆసక్తికరంగా, నవ్వులు పంచుతూ సాగిన ఈ టీజర్‌ను మీరూ చూసేయండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
స్వప్న సినిమాస్ పతకంపై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాధన్ స్వరాలు సమకూరుస్తున్నారు. మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.