ETV Bharat / sitara

'జాతిరత్నాలు' సీక్వెల్​ రూపొందిస్తాం: అనుదీప్​ - నవీన్​ పోలిశెట్టి

అభిమానుల కేరింతలు.. నటీనటుల ఉల్లాసం మధ్య.. 'జాతిరత్నాలు' విజయోత్సవ వేడుక గురువారం రాత్రి హైదరాబాద్​లో సందడిగా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర దర్శక, నిర్మాతలు అనుదీప్​, నాగ్​ అశ్విన్​ తమ సినిమాను విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే 'జాతిరత్నాలు' సీక్వెల్​ను రూపొందిస్తామని దర్శకుడు ఈ సందర్భంగా వెల్లడించారు.

Jathi Ratnalu movie sequel on the cards
'జాతిరత్నాలు' సీక్వెల్​ రూపొందిస్తాం: అనుదీప్​
author img

By

Published : Mar 19, 2021, 9:45 AM IST

కలలను నిజం చేసేవాళ్లే తెలుగు ప్రేక్షకులు అని హీరో నవీన్‌ పొలిశెట్టి అన్నారు. అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జాతిరత్నాలు' సినిమాలో నవీన్​ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధానపాత్రలు పోషించారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌. మార్చి 11న శివరాత్రి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుక నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో నవీన్​ పొలిశెట్టి మాట్లాడారు.

"ఇలాంటి సినిమాలు ఈ సమయంలో ఎంతో అవసరం. మీ స్పందన చూస్తుంటే ఒక కలలా ఉంది. తెలుగు ప్రేక్షకులు మా కలలను నిజం చేశారు. మా సినిమాలో కనిపించే జాతి రత్నాలు నేను, దర్శి, రాహుల్‌ రామకృష్ణ కానీ.. కనిపించని 'జాతిరత్నాలు' నాగ్‌ అశ్విన్‌, ప్రియాంక, స్వప్న. నాగీ ఈ సినిమా కోసం 'మహానటి' కంటే ఎక్కువగా కష్టపడ్డాడు. డైరెక్టర్‌ అనుదీప్‌ గురించి చెప్పాలంటే.. నాకు కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఒక డైరెక్టర్‌ను కలిశానని అనుకున్నాను. కానీ.. ఇప్పుడు ఒక బ్రదర్‌ దొరికాడు."

- నవీన్ పొలిశెట్టి, 'జాతిరత్నాలు' కథానాయకుడు

ప్రియదర్శి, రాహుల్​ రామకృష్ణ మాట్లాడుతూ.. సినిమాను ఇంతలా ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ఈ వేడుకలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు చిత్రబృందాన్ని అభినందించారు. 'జాతిరత్నాలు'కు సీక్వెల్​గా 'జాతిరత్నాలు 2' తెరకెక్కించనున్నట్లు దర్శకుడు అనుదీప్​ ఈ సందర్భంగా ప్రకటించారు.

ఇదీ చూడండి: 'జాతిరత్నాలు' అనుదీప్ చెప్పులేసుకోరు.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.