దివంగత నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ దక్షిణాదిలో అవకాశం వస్తే నటిస్తానని చెబుతూ ఉంటుంది. ప్రస్తుతం ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు నటించనున్నారని సమాచారం. తాజాగా ఓ కథానాయిక పాత్ర కోసం జాన్వీ కపూర్‌ని ఎంపిక చేశారని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
గతంలో సమంత, పూజాహెగ్డే, రష్మిక లాంటి కథానాయికల పేర్లు కూడా వినిపించాయి. కానీ అధికారికంగా మాత్రం వెల్లడించలేదు. మొత్తం మీద ఈ నలుగురిలో ఆ ఇద్దరు ఎవరో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
ఈ సినిమాకు 'అయినను పోయిరావలె హస్తినకు' అనే పేరు పరిశీలిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. జాన్వీ ప్రస్తుతం బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి 'దోస్తానా 2' చిత్రంలో నటిస్తోంది.