ETV Bharat / sitara

బొమ్మ దద్దరిల్లింది.. బాక్సాఫీస్ 'గలగల'లాడింది - tollywood news

ఈ నెలలో వచ్చిన పలు చిత్రాలు.. ప్రేక్షకులను మెప్పించి, వసూళ్లు వర్షం కురిపించాయి. అవేంటి? వాటి సంగతేంటి? తెలియాలంటే  ఈ కథనం చదవాల్సిందే.

JANUARY REPORT OF INDIAN CINEMA
జనవరి సినిమా ఫలితాలు
author img

By

Published : Feb 1, 2020, 12:06 PM IST

Updated : Feb 28, 2020, 6:33 PM IST

సాధారణంగా సినిమా రంగంలో విజయాల శాతం చాలా తక్కువగా ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. కానీ ఈ ఏడాది ఆరంభం చిత్ర పరిశ్రమకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలన్నీ దాదాపు బాక్సాఫీస్‌ దగ్గర కాసుల వర్షం కురిపించి, దర్శక-నిర్మాతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. యాక్షన్‌, కామెడీ, కుటుంబ, చారిత్రక ఇలా విభిన్న నేపథ్యాల చిత్రాలు బాక్సాఫీస్‌ పాత రికార్డులు బద్దలు కొట్టి, సరికొత్త రికార్డులు సృష్టించాయి. కొత్త ఏడాదికి తిరుగులేని ఆరంభాన్ని ఇచ్చి.. సినీ అభిమానులను విశేషంగా అలరించిన సినిమాలపై జనవరి బాక్సాఫీస్‌ రిపోర్ట్‌.

అతడే శ్రీమన్నారాయణ

కొత్త ఏడాదికి సరికొత్త ఆరంభాన్ని ఇచ్చిన పాన్‌ ఇండియా మూవీ 'అతడే శ్రీమన్నారామణ'. రక్షిత్‌ శెట్టి హీరో. జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శాన్వీ హీరోయిన్. 'కేజీఎఫ్‌' తరువాత కన్నడ నుంచి విడుదలైన పాన్‌ ఇండియా చిత్రమిదే. విభిన్నమైన జోనర్‌లో రూపొంది, ఐదు భాషల్లో విడుదలై అందర్ని అలరించింది. కన్నడలో భారీ విజయం నమోదు చేసిన సినిమా తెలుగులో పర్వాలేదనిపించింది.

rakshit shetty
అతడే శ్రీమన్నారాయణ సినిమాలో రక్షిత్ శెట్టి

తూటా

తమిళ అగ్రహీరో ధనుష్‌, మేఘ ఆకాష్‌ జంటగా ప్రేమకథ, యాక్షన్‌ను సమపాళ్లలో మేళవించిన చిత్రం 'తూటా'. వెండితెరపై ప్రత్యేక శైలి ఏర్పరచుకున్న గౌతమ్‌ మేనన్‌ దర్శకుడు. అయితే ఈ సినిమాతో మరోసారి మ్యాజిక్‌ చేద్దామనుకున్న ఇతడు.. బాక్సాఫీస్‌ దగ్గర ప్రభావం చూపించలేకపోయాడు. మంచి అంచనాలతో జనవరి 1న వచ్చిన 'తూటా' అభిమానులను నిరాశ పరిచింది.

dhanush-megha akash
తూటా సినిమాలో ధనుష్-మేఘ ఆకాశ్

దర్బార్‌

జనవరిలో అత్యధికంగా సినిమాలు విడుదలవటానికి కారణం సంక్రాంతి. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 'దర్బార్‌'.. పతంగుల పండుగ సందడిని కొన్ని రోజులు ముందుగానే తెచ్చింది. జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన సినిమా రజనీ మార్క్‌ స్టైల్‌, మేనరిజమ్స్‌తో అభిమానుల్ని అలరించింది. బాక్సాఫీస్‌ వద్ద రూ.200 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి ముందుకు సాగుతుంది.

superstar rajnikanth
దర్బార్ సినిమాలో సూపర్​స్టార్ రజనీకాంత్

ఛపాక్‌

యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఛపాక్‌'. గ్లామర్‌ క్వీన్‌ దీపికా పదుకొణె హీరోయిన్​గా నటించింది. కథ నచ్చటం వల్ల నిర్మాణంలోనూ పాలు పంచుకుంది. ట్రైలర్‌తో అంచనాలు పెంచిన ఈ సినిమా.. బాక్సఫీస్‌ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.

deepika padukone
ఛపాక్ సినిమాలో దీపికా పదుకొణె

తానాజీ ది అన్‌సంగ్‌ వారియర్‌

ఈ ఏడాది బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా ఎక్కువగా ఉండబోతోంది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ సైన్యంలో కీలక పాత్ర పోషించిన తానాజీ మలుసరే జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమే 'తానాజీ: ది అన్‌సంగ్ వారియర్‌'. అజయ్‌ దేవగణ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం.. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్‌ పై చేసిన దండయాత్రలో భారీ విజయం సాధించి రూ.200 కోట్ల కలెక్షన్లు వసూలు చేసిన చిత్రాల జాబితాలోకి చేరింది.

ajay devgan
తానాజీ సినిమాలో అజయ్ దేవగణ్​

సరిలేరు నీకెవ్వరు

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్ బాబు, వరుస సూపర్‌ హిట్‌ చిత్రాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్‌ రావిపూడి కాంబినేషన్​లో వచ్చిన యాక్షన్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమాతోనే లేడీ అమితాబ్‌ విజయశాంతి రీఎంట్రీ ఇచ్చారు. విడుదలకు ముందు ఉన్న భారీ అంచనాలను మించి మరీ బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ కొట్టింది. మహేశ్‌ కెరీర్‌లోనే బిగెస్ట్‌ హిట్‌గా నిలిచి, రూ.220 కోట్ల గ్రాస్‌ వసూలు సాధించింది. మరిన్ని రికార్డులు నెలకొల్పే దిశగా సాగుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న వచ్చి, అప్పటి నుంచి థియేటర్లో బొమ్మ దద్దరిల్లిపోయేలా సందడి చేస్తోంది.

mahesh babu
సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేశ్​బాబు

అల వైకుంఠపురములో

సంక్రాంతి ఉత్సాహాన్ని రెట్టింపు చేయటానికి వచ్చిన సినిమా 'అల వైకుంఠపురములో'. గ్యాప్‌ ఇవ్వలా వచ్చింది... అంటూ గ్యాప్‌ తీసుకొని బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు కొట్టాడు బన్నీ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ తన మార్క్‌ మ్యాజిక్‌తో మరోసారి మరుపురాని విజయం నమోదు చేశాడు. ఈ సినిమాతో వీరు హ్యాట్రిక్ విజయం సాధించారు. సుమారు రూ.200 కోట్ల వసూలు సాధించిందని అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం.

allu arjun
అల వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్

డిస్కోరాజా

మాస్‌ మహరాజా రవితేజ, విభిన్న చిత్రాల దర్శకుడు వి.ఐ ఆనంద్‌ కాంబినేషన్‌లో వచ్చిన సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ మూవీ 'డిస్కో రాజా'. పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌ హీరోయిన్లు. రవితేజ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. జనవరి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథలోని ట్విస్టులు , రవితేజ హుషారు సినిమాను ముందుకు నడిపించాయి. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది.

raviteja nabha natesh
డిస్కోరాజా సినిమాలో రవితేజ-నభా నటేశ్

పంగా

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'పంగా'. తల్లి అయిన తరువాత, అనుకున్న లక్ష్యాన్ని సాధించొచ్చు అనే కథాంశం ఆధారంగా రూపొందిన చిత్రమిది. మధ్యతరగతి మహిళగా కంగనా పండించిన భావోద్వేగాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా మహిళల గురించి ఆలోచింప చేసే మంచి చిత్రంగా మిగిలిపోయింది సినిమా. జనవరి 24న ప్రేక్షకులను పలకరించింది సినిమా.

kanagana ranuth
పంగా సినిమాలో కంగనా రనౌత్

అశ్వథ్థామ

టాలీవుడ్‌లో లవర్‌బాయ్‌ ఇమేజ్‌ ఉన్న యువహీరో నాగశౌర్య.. యాక్షన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం 'అశ్వథ్థామ'. ఈ సినిమా కథ శౌర్యనే రాశాడు. ఈ ఏడాది వచ్చిన మొదటి థ్రిల్లర్‌ సినిమా ఇదే. జనవరి 31న థియేటర్లలోకి వచ్చి, సినీ అభిమానులకు మంచి థ్రిల్‌ను పంచుతున్నాడు 'అశ్వథ్థామ'.

naga shourya
అశ్వథ్థామ సినిమాలో హీరో నాగశౌర్య
మొత్తంగా ఈ జనవరి.. మునుపెన్నడూ లేని విజయాల శాతాన్ని నమోదు చేసిందని చెప్పొచ్చు.

AP Video Delivery Log - 0500 GMT News
Saturday, 1 February, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0447: China WHO Virus AP Clients Only 4252347
WHO expects new virus infections to rise
AP-APTN-0442: US CA Bryant Lakers Game Must credit KTLA; No access Los Angeles; No use by US Broadcast Networks; No re-sale, re-use or archive 4252346
Roses for Kobe Bryant as Lakers play after crash
AP-APTN-0405: UK Cummings No access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4, Euronews; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4252345
Cummings snaps at reporter on Brexit night
AP-APTN-0323: Australia Wildfire No access Australia 4252343
Wildfire causes state of emergency in Canberra
AP-APTN-0310: UK Brexit Newspapers AP Clients Only 4252342
UK Brexit day newspapers roll off the presses
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 28, 2020, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.