ETV Bharat / sitara

రూ.70 కోట్లకు జాన్వీ కపూర్ సినిమా!

author img

By

Published : Jun 25, 2020, 7:12 AM IST

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్​ నటించిన 'గుంజన్ సక్సేనా'ను నెట్​ఫ్లిక్స్​ భారీ ధరకు కొనుగోలు చేసిందని సమాచారం. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

రూ.70 కోట్లకు జాన్వీ కపూర్ సినిమా!
జాన్వీ కపూర్

బాలీవుడ్​ ఓటీటీ బాటపట్టింది. అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా నటించిన 'గులాబో సితాబో'.. ఇటీవలే అమెజాన్ ప్రైమ్​లో విడుదలైంది. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ 'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్'.. నెట్​ఫ్లిక్స్​లో రానుంది. అయితే ఈ చిత్రాన్ని భారీ మొత్తానికి అమ్మినట్లు సమాచారం. ఏకంగా రూ.70 కోట్లు పెట్టి దీనిని కొనుగోలు చేసిందట సదరు సంస్థ.

Janhvi Kapoor starrer Gunjan Saxena
'గుంజన్ సక్సేనా' సినిమాలో జాన్వీ కపూర్

కార్గిల్ యుద్ధంలో పోరాడిన తొలి మహిళా యుద్ధ పైలెట్​ గుంజన్ సక్సేనా జీవిత కథతో ఈ సినిమా తీశారు. దీంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో పంకజ్ త్రిపాఠి, అంగద్ బేడీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శరణ్ శర్మ దర్శకుడు.

"తక్కువ బడ్జెట్​తో తీసిన 'గులాబో సితాబో'ను సుమారు రూ.65 కోట్లకు అమెజాన్ కొనుగోలు చేసింది. 'గుంజన్..'ను రూ.25-30 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇప్పుడు ఈ చిత్రానికి ఇంత ధర రావడం నిర్మాత కరణో జోహార్​కు బాగా కలిసొచ్చింది. తమ సినిమాలను డిజిటల్ ఫ్లాట్​ఫామ్స్​లో విడుదల చేయడం ద్వారా నిర్మాతలకు మంచిగా ఆర్జించే అవకాశముంటుంది" అని అన్నారు పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.