శ్రీదేవి వారసురాలిగా సినిమాల్లోకి వచ్చిన జాన్వీ కపూర్.. తల్లికి తగ్గ తనయ అనిపించుకుంటోంది. 2018లో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ కథల ఎంపికలో ప్రత్యేకత చూపిస్తోంది. అందుకే ఆమె సినిమాలు కమర్షియల్గానూ విజయాలు సాధిస్తున్నాయి. జాన్వీ కూడా తన అందం, అభినయంతో అందరి చేత శెభాష్ అనిపించుకుంటోంది.
జాన్వీ నటిస్తోన్న 'రూహి' చిత్రం నుంచి తాజాగా ఓ పాట విడుదలైంది. అందులో ఆమె అదిరిపోయేలా స్టెప్పులేయడమే కాకుండా హావభావాల్లోనూ తన తల్లిని గుర్తు చేసింది. ఈ పాటలో జాన్వీని చూస్తుంటే 'మిస్టర్ ఇండియా' చిత్రంలో 'హవా హవాయి' పాటలో శ్రీదేవిని చూస్తున్నట్లే ఉందని అభిమానులు పోలుస్తున్నారు. రెండు పాటల్లోనూ తల్లి, కూతురు ధరించిన దుస్తులు ఒకేలా ఉండటం వల్ల అచ్చం శ్రీదేవిని చూసినట్లే అనిపిస్తోందని కామెంట్లు పెడుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: అతిలోక సుందరి నందన.. నీ సొగసుకు వందనం