రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కపూర్ జంటగా ఓ హారర్ థ్రిల్లర్ చిత్రం తెరకెక్కుతోంది. దీనికి మొదట 'రూహ్ ఆఫ్జా' అనే పేరు పెట్టారు. కానీ ఇదో పానీయం బ్రాండ్ కావడం వల్ల సినిమా పేరుని 'రూహీ ఆఫ్జా'గా మార్చారు. ఇప్పుడు మరోసారి టైటిల్‌ని మార్చింది చిత్రబృందం. తాజాగా ఈ సినిమాకు 'రూహీ ఆఫ్జానా'గా టైటిల్ మార్చారు.
ఈ సినిమాను నిర్మిస్తున్న మేడ్డక్ ఫిలిమ్స్ తమ సంస్థ నుంచి త్వరలో రాబోయే చిత్రాల జాబితాను ప్రకటించింది. అందులో రాజ్‌కుమార్, జాన్వీల చిత్రం పేరు 'రూహీ ఆఫ్జానా'గా ఉంది. ఈ చిత్ర నిర్మాత దినేష్ విజన్ మాట్లాడుతూ "ఇందులో రెండు భిన్నమైన పార్శ్వాలున్న పాత్రలో ఒదిగిపోయింది జాన్వీ" అన్నారు. హార్థిక్ మెహతా తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదలకానుంది.
ఇవీ చూడండి.. 'మీటూ' స్త్రీల సమస్య మాత్రమే కాదు: సన్నీ