'జేమ్స్ బాండ్' సినిమా అంటే ప్రేక్షకులకు ఓ ఎమోషన్. ఇప్పటికే విడుదలైన ఈ ఫ్రాంచైజీలోని చిత్రాలు అభిమానుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. కాగా మరోసారి ప్రేక్షకుల మన్ననలు అందుకోవడానికి బాండ్ వస్తున్నాడు. ఈసారి 'నో టైమ్ టు డై' అంటూ అలరించబోతున్నాడు. లాక్‌డౌన్ కారణంగా ఆలస్యమైన ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. నవంబరులో బాండ్ థియేటర్లలో సందడి చేస్తాడని ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. ఈ రోజు సినిమా కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు.
బాండ్ సినిమాల నుంచి ఆశించే ఒళ్లు గగుర్పొడిచే సాహసాలు, నమ్మలేని యాక్షన్ సన్నివేశాలు, బాండ్ గర్ల్స్ అందచందాలు, మిస్టీరియస్ కార్లు, వైవిధ్యమైన వాహనాలు, గన్స్... ఇలా అన్నింటినీ ట్రైలర్‌లో పొందుపరిచారు. ట్రైలర్ మొత్తం ఒకెత్తయితే... ఆఖరి సన్నివేశంలో బాండ్ ముందు కారు బోల్తా కొట్టడం మరో ఎత్తు. "గతం ఇంకా గతించలేదు" అంటూ బాండ్ నోట డైలాగ్‌తో మొదలయ్యే ట్రైలర్ హంగామా... బాండ్ స్టైల్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ముగుస్తుంది.
డేనియల్ మరోసారి బాండ్‌గా కనిపిస్తున్న ఈ సినిమాకు కేరీ జోజీ ఫకునగా దర్శకత్వం వహిస్తున్నాడు. రామి మలేక్, లా సేడోక్స్, బెన్ విషా, నవోమీ హారిస్ తదితరులు ఇతర ప్రధాన పాత్రధారులు. నవంబరు 12న ఈ సినిమా యూకేలో విడుదలవుతుండగా, అదే నెల 20న యూఎస్‌లో విడుదల చేస్తున్నారు. మన దేశంలో ఎప్పుడు విడుదల అనే విషయంపై స్పష్టత లేదు. 250 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ఇది. తొలుత ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేస్తామనుకున్న విషయం తెలిసిందే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">