ట్విలైట్ సిరీస్‌లో వ్యాంపైర్‌గా మెప్పించిన హాలీవుడ్ నటుడు రాబర్ట్ ప్యాటిన్సన్ బ్యాట్‌మ్యాన్ అవతారమెత్తనున్నాడు. ఈ పాత్రకు సంబంధించి వార్నర్ బ్రదర్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాడు రాబర్ట్. మ్యాట్ రీవ్స్ దర్శకత్వం వహించబోతున్న 'ద బ్యాట్‌మ్యాన్' సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.
ఈ ఏడాది చివర్లో లేదా 2020 ప్రారంభంలో కానీ 'ద బ్యాట్‌మ్యాన్' సినిమా పట్టాలెక్కనుంది. ఇప్పటికే క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కిస్తున్న 'టెనెట్' చిత్రంలో నటిస్తున్నాడు రాబర్ట్. ఇవే కాకుండా నెట్‌ఫ్లిక్స్ చిత్రాలు 'ద లైట్ హౌస్', 'వెయిటింగ్ ఫర్ ద బార్బేరియన్స్' సినిమాల్లోనూ ముఖ్య భూమిక పోషించనున్నాడు.
మ్యాట్ రీవ్స్ ఇంతకముందు 'లెట్ మీ ఇన్', 'డాన్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్', 'వార్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్' చిత్రాలకు దర్శకత్వం వహించాడు.
ఇప్పటివరకు 3 సినిమాల్లో బ్యాట్‌మ్యాన్ పాత్రను పోషించిన బెన్ అఫ్లెక్ ఇటీవలే తప్పుకున్నాడు. 'బ్యాట్‌మ్యాన్ వర్సస్ సూపర్ మ్యాన్: డాన్ ఆఫ్ జస్టిస్', 'సూసైడ్ స్క్వాడ్', 'జస్టిస్ లీగ్' చిత్రాల్లో బెన్ అఫ్లెక్ గబ్బిలం మనిషిగా కనిపించాడు.
ఇది చదవండి: సైకోకిల్లర్ వేటలో... 'అల్లుడు శ్రీను'