పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తోన్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. నభా నటేష్, నిధి అగర్వాల్ కథానాయికలు. ఈ చిత్రంలో 'ఉండిపో' అనే రొమాంటిక్ గీతాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది చిత్రబృందం.
ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలతో అందరిలోనూ అంచనాలు పెంచేసిన పూరీ.. ఇప్పుడు ఓ రొమాంటిక్ గీతాన్ని బయటకొదిలాడు. "ఉండిపో ఉండిపో చేతిలో గీతలా..." అంటూ సాగే మెలోడీ గీతానికి భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించగా.. మణిశర్మ స్వరాలు సమకూర్చాడు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి - రమ్య బెహెర ఆలపించారు. ఇందులో సాహిత్యానికి తగ్గట్లుగా బీచ్ ఒడ్డున రామ్.. తన జోడీ నిధి అగర్వాల్‌తో రొమాన్స్‌లో మునిగితేలాడు.
ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ చిత్రం జులై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">