'భరత్ అను నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు'తో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 'సర్కారు వారి పాట'తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. అయితే.. ఆ సినిమాలో మహేశ్ లుక్ ఇదే అంటూ నెట్టింట ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. తన సతీమణి నమత్రతో కలిసి ప్రిన్స్ ఇటీవల ఓ శుభకార్యానికి హాజరయ్యారు. అందులో మహేశ్‌బాబు మునుపటికంటే కాస్త పొడవైన జుట్టుతో స్మాషింగ్ లుక్‌లో కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఇదొక్కటే కాదు.. క్రిస్మస్ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోలను నమత్ర ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. అందులోనూ మహేశ్ ఇదే లుక్‌లో కనిపించారు. దీంతో.. 'సర్కారువారి పాట' కోసం మహేశ్ జుట్టు పెంచుతున్నారని, అందులో మహేశ్ లుక్ ఇదేనంటూ.. జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి.. మహేశ్ నిజంగానే తర్వాతి సినిమాలో ఈ లుక్‌లో కనిపించనున్నారా..? లేదా..? అనేది తెలియాలంటే మాత్రం ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే.

కరోనా వల్ల చిత్రీకరణలు లేకపోవడం వల్ల ఇంటికే పరిమితమయ్యారు ప్రిన్స్. లాక్‌డౌన్ తర్వాత ప్రభుత్వం షూటింగ్‌లకు అనుమతులివ్వడం వల్ల తాజాగా ఆయన ఓ ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఫొటోలతో అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చారు.
ఇదీ చూడండి : మహేశ్‌బాబు జెంటిల్మన్.. బాలీవుడ్ హీరో ప్రశంసలు