Harnaaz Sandhu Miss Universe 2021: భారత యువతి హర్నాజ్ సంధు ప్రపంచ వేదికపై సత్తాచాటింది. 2021 ఏడాదికిగానూ మిస్ యూనివర్స్‌గా నిలిచింది. ఇజ్రాయెల్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో 80 దేశాల నుంచి భామలు పాల్గొనగా.. వీరందరినీ వెనక్కినెడుతూ మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకుంది. దీంతో 21 ఏళ్ల తర్వాత భారత్‌కు ఈ టైటిల్ దక్కింది. చివరిసారిగా 2000లో లారా దత్తా మన దేశం తరఫున ఈ కిరీటం దక్కించుకుంది.
హర్నాజ్ సంధు.. 2000 మార్చి 3న చండీగఢ్‌లో జన్మించింది. డిగ్రీ పూర్తి చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మాస్టర్స్ చదువుకుంటోంది. ఓ వైపు అందాల పోటీల్లో పాల్గొంటూనే మరోవైపు చదువు కొనసాగిస్తోందీ 21ఏళ్ల అమ్మడు.
17ఏళ్ల వయసులో మోడలింగ్ ప్రారంభించిన హర్నాజ్ ఇప్పటివరకు 2017లో టైమ్స్ ఫ్రెష్ ఫేస్ మిస్ చండీగఢ్, 2018లో మిస్ మ్యాక్స్ ఎమర్జింగ్ స్టార్, 2019లో ఫెమినా మిస్ ఇండియా పంజాబ్, మిస్ దివా 2021, ఇప్పుడు 2021లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకుంది. స్వతహాగా నటి అయిన ఈమె.. యారా దియాన్ పో బరన్, బై జీ కుట్టంగే అనే పంజాబీ సినిమాల్లోనూ కథానాయికగా నటించింది.