ETV Bharat / sitara

క్వారంటైన్​ నుంచి కంగనా రనౌత్​కు మినహాయింపు - ముంబయిలో కంగన

స్వస్థలం హిమాచల్​ ప్రదేశ్​ నుంచి ముంబయి చేరుకున్న కంగన, ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవడం వల్ల క్వారంటైన్​ నుంచి అధికారులు మినహాయింపునిచ్చారు. ప్రస్తుతం ఈమెకు, మహారాష్ట్ర సర్కారు మధ్య వివాదం నడుస్తోంది.

Indian actress exempted from home quarantine
నటి కంగనా రనౌత్
author img

By

Published : Sep 10, 2020, 10:57 AM IST

ముంబయిని పాక్ ఆక్రమిత కశ్మీర్​తో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​.. బుధవారం అదే నగరానికి చేరుకుంది. అయితే నిబంధనల ప్రకారం ఓ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్తే 14 రోజులు క్వారంటైన్​లో ఉండాలి. కానీ ఈ విషయంలో కంగనకు మినహాయింపు ఇచ్చినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

ముంబయిలో కంగన కొన్నిరోజులు మాత్రమే ఉండేందుకు వచ్చినట్లు ఆన్​లైన్​ అప్లికేషన్ పెట్టారని, దీంతో ఆమెకు 'షార్ట్ టెర్మ్ విజిటర్ కేటగిరీ'లో భాగంగా మినహాయింపు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సెప్టెంబరు 14న హిమాచల్ ప్రదేశ్​కు తిరుగు ప్రయాణం కానుందీ నటి.

అంతకు ముందు ముంబయిలోని కంగనా​ నివాసానికి మంగళవారం నోటీసులు జారీ చేసిన బీఎమ్​సీ అధికారులు.. బుధవారం దానిని పాక్షికంగా కూల్చివేశారు. దీంతో కంగన హైకోర్టుకు వెళ్లగా, న్యాయస్థానం అక్రమ నిర్మాణం కూల్చివేత విషయంపై స్టే ఇచ్చింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.