నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు నటిస్తోన్న మల్టీస్టారర్ 'వి'. నివేదా థామస్, అతిదీరావ్ హైదరీ హీరోయిన్లు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఇందులో నాని, సుధీర్ల పాత్రలు సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి. నాని కెరీర్లో 25వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ మూవీ డైలాగ్స్‌తో పాటు విజువల్స్ అదిరిపోయాయి.
ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం సమకూరుస్తున్నాడు. తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నాడు. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే నెల 25న ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
- " class="align-text-top noRightClick twitterSection" data="">