ETV Bharat / sitara

'నా శరీరం నాకే అసహ్యంగా కనిపించేది!' - ఇలాయానా బాడీ డిస్​మార్ఫింగ్​

ఓ దశలో బాడీ డిస్​మార్ఫియా సమస్యతో బాధపడినట్లు తెలిపింది నటి ఇలియానా. అద్దంలో తనను తాను చూసుకున్నప్పుడు శరీరం అసహ్యంగా కనిపించేదని చెప్పింది. ప్రస్తుతం ఈ ముద్గుగుమ్మ హిందీలో పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది.

ileana
ఇలియానా
author img

By

Published : Mar 6, 2021, 5:02 PM IST

గోవా బ్యూటీ ఇలియానా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చి సందడి చేసింది. 'ఆస్క్‌ మీ ఎనీథింగ్‌' పేరిట నిర్వహించిన ఈ చాటింగ్‌లో పలు ఆసక్తికర విషయాలను పంచుకొందీ ముద్దుగుమ్మ. ఇందులో భాగంగా ఒకానొక సమయంలో 'బాడీ డిస్​మార్ఫియా' అనే ఫోబియాతో తాను బాధపడినట్లు తెలిపింది. ఓ దశలో తన శరీరం పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు చెప్పింది ఇలియానా. అద్దంలో తన శరీరాన్ని చూసుకుని బాధపడిన్నట్లు వెల్లడించింది.

ileana
ఇలియానా

"కొంతమంది అమ్మాయిలు.. తమ శరీర కొలతలు సరిగ్గా , అందంగా ఉన్నప్పటికీ శరీరం పట్ల అసంతృప్తికి గురవుతుంటారు. దానినే బాడీ డిస్​మార్ఫియా అంటారు. దానిని కవర్​ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. జీవితంలో ప్రతిక్షణాన్ని ఆస్వాదించినప్పుడు మనసు నిర్మలంగా ఉంటుంది. అప్పుడు మనం మరింత బలంగా తయారవుతాం. అందంగానూ కనపిస్తాం. ఈ విషయం చాలా మందికి తెలియడం లేదు. ఒకప్పుడు ఈ సమస్యతో నేనూ బాధపడ్డాను. అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు నా శరీరం అసహ్యంగా కనిపించేది(నవ్వుతూ). కానీ ఇప్పుడు అలా కాదు. నా శరీరం పట్ల సానుకూల దృక్పథంతో చూడటం నేర్చుకున్నాను."

-ఇలియానా, నటి.

'దేవదాసు' చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ.. ప్రస్తుతం తెలుగు తెరకు దూరంగా ఉంది. 'అన్‌ఫెయిర్‌ అండ్‌ లవ్లీ', 'ది బిగ్‌ బుల్‌' చిత్రాలతో బాలీవుడ్‌లో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది.

ileana
ఇలియానా
ileana
ఇలియానా

ఇదీ చూడండి: ముద్దుగుమ్మ ఇలియానా కొత్త బాయ్​ఫ్రెండ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.